Tripti Dimri : బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్ టైటిల్ రోల్ పోషించిన 'యానిమల్'(Animal) మూవీలో అవకాశం దక్కడంపై యంగ్ బ్యూటీ త్రిప్తి డిమ్రి(Tripti Dimri) హ్యాపీగా ఫీల్ అవుతోంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రష్మిక(Rashmika) మెయిన్ హీరోయిన్ గా వచ్చిన సినిమాలో జోయా పాత్రలో హాట్ హాట్‌గా అందాలు ఆరబోస్తూ కుర్రాళ్లను కట్టిపడేసింది త్రిప్తి. అయితే ఒక్క భారీ ప్రాజెక్టుతో ఓవర్‌నైట్ సూపర్ క్రేజ్ సంపాదించుకున్న ఆమె రీసెంట్ ఇంటర్వ్యూలో మూవీ ఆఫర్ దక్కించుకోవడంలో చాలా ట్విస్ట్ లున్నాయని చెప్పింది.
ఈ మేరకు ఉత్తరాఖండ్ కు చెందిన ఈ బ్యూటీకి 'యానిమల్' సక్సెస్‌తో ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయిందని తెలిపింది. 'జోయా పాత్ర కోసం సందీప్ రెడ్డి వంగా మొదట నిర్వహించిన ఆడిషన్స్‌లో సారా అలీఖాన్‌ను ఎంపిక చేశారు. కానీ ఆమె ఆ రోల్‌ను తిరస్కరించినట్లు తెలిసింది. ఆ తర్వాత 'Qala' ప్రాజెక్ట్‌లో నన్ను చూసిన సందీప్ రెడ్డి వంగా.. ఓ యాడ్ షూట్లో ఉండగా కాల్ చేశాడు. అదే రోజు నన్ను తన దగ్గరకు పిలిపించుకొని యానిమల్‌లో కీలక పాత్ర కోసం సెలెక్ట్ చేశారని చెప్పారు.
ఇక్కడి వరకూ బాగానే ఉన్నా.. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. ఈ సినిమా ఒకే అనుకున్న ఫిక్స్ అయిన నాకు.. ఏడాది వరకు సందీప్ నుంచి ఎలాంటి సమాచారం, కాల్ రాలేదు. దీంతో చాలా బాధపడ్డాను. చేతికందిన గొప్ప అవకాశం చేజారిపోయిందని ఫీల్ అయ్యాను. కానీ అనుకోకుండా మళ్లీ ఆయనే మరోసారి టచ్‌లోకి వచ్చారు. సినిమాలో మీరు నటిస్తున్నారు. మీది నెగెటివ్ రోల్, కానీ పాజిటివ్ మ్యానర్‌లో కనిపించాల్సి ఉంటుంది' అని చెప్పేశారు. దీంతో ఒక్కసారిగా షాక్ అయిన నేను ఆనందంతో గంతులేశానంటూ చెప్పుకొచ్చింది.
Also read :ఎన్టీఆర్ తో సీరియల్ నటి రొమాన్స్.. ఆమె గ్లామర్ చూస్తే కుర్రాళ్లు క్లీన్ బౌల్డే
ఇదిలావుంటే.. కేవలం 'యానిమల్' సినిమాలో బోల్డ సీన్ ఎఫెక్ట్ కారణంగా ఫాలోవర్ల సంఖ్య 60K దాటిందని, ఈ సినిమా రిలీజ్ అయిన మూడు రోజుల్లోనే 1.2 మిలియన్‌కు చేరుకున్నట్టు తెలిపింది. ఇక బోల్డ్ బ్యూటీ ప్రస్తతుం రెండు సినిమాల్లో నటిస్తున్నట్లు తెలుపగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తానంది.