వరద బాధితులకు సచివాలయ ఉద్యోగుల సంఘం సాయం
వరద బాధితులకు సహాయం చేయడం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘం ఒక రోజు మూల వేతనాన్ని అందించింది. సంఘం నేతలు ఈ రోజు సీఎం చంద్రబాబును కలిసి విరాళం అందించారు. వారిని చంద్రబాబు అభినందించారు.
వరద బాధితులకు సహాయం చేయడం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘం ఒక రోజు మూల వేతనాన్ని అందించింది. సంఘం నేతలు ఈ రోజు సీఎం చంద్రబాబును కలిసి విరాళం అందించారు. వారిని చంద్రబాబు అభినందించారు.
హీరోయిన్ సమంత షూటింగ్ లో గాయపడింది. తాజాగా ఆమె నీడిల్ ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న ఒక ఫొటోను తన ఇన్ స్టార్ స్టోరీస్ లో షేర్ చేస్తూ..' గాయాలు లేకుండా నేను యాక్షన్ స్టార్ కాగలనా' అని రాసుకొచ్చింది. దీంతో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో భాగంగా ఆమె గాయపడినట్లు స్పష్టమవుతోంది.
వరదల కారణంగా నష్టపోయిన బాధితులందరినీ ఆదుకుంటామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భరోసానిచ్చారు. ప్రతీ ఒక్కరికీ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. బాధితుల గుర్తింపునకు అధికారులు వెంటనే సర్వే ప్రక్రియ ప్రారంభించి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
తెలుగు రాష్ట్రాల వరద బాధితుల కోసం అక్కినేని కుటుంబం అంతా కోటి రూపాయల విరాళం అందజేశారు. విశాఖపట్నంలోని అలుఫ్లోరైడ్ లిమిటెడ్, హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్, అక్కినేని కుటుంబానికి చెందిన గ్రూప్ కంపెనీస్ ఈ విరాళాన్ని అందజేస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు.
టాలీవుడ్ హీరో ప్రభాస్ వరద బాధితులకు రూ.5 కోట్లు విరాళమిచ్చాడనే వార్త ఒకటి బయటికొచ్చింది. అయితే ఇందులో ఏ మాత్రం నిజం లేదని తేలింది. ఆయన 5 కోట్లు ప్రకటించినట్లు అధికారికంగా ఎక్కడా లేదు. కేవలం ఫ్యాన్స్ ఈ పుకార్లు సృష్టించి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నట్లు సమాచారం.
తెలుగు రాష్ట్రాల్లోని వరద ప్రభావిత గ్రామాలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భారీ విరాళం ప్రకటించారు. ఈ మేరకు రూ.4 కోట్లు మొత్తం ముంపు గ్రామ పంచాయతీలకు పంపించాలని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. కోటి విరాళం అందించనున్నానని మీడియా వేదికగా తెలిపారు.
2019 తర్వాత బుడమేరు ప్రాంతాల్లో జరిగిన ఆక్రమణలు, అక్రమ కట్టడాలు వచ్చాయని చంద్రబాబు అన్నారు. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున వరద నీరు విజయవాడను ముంచెత్తిందన్నారు. ఇందుకు సంబంధించి త్వరలోనే సర్వే జరిపించనున్నట్లు చెప్పారు.
హరీష్ శంకర్, రవితేజ కాంబోలో వచ్చిన 'మిస్టర్ బచ్చన్' మూవీ అట్టర్ ప్లాప్ అయిన విషయం తెలిసిందే. ఈ మూవీతో నిర్మాతలకు నష్టాలొచ్చాయి. ఈ క్రమంలోనే డైరెక్టర్ హరీష్ శంకర్ తన రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆయనపై నెటిజన్స్ ప్రశంసలు కురిసిపిస్తున్నారు.
బాలీవుడ్ నటుడు సోనూసూద్ వరద బాధితుల కోసం అండగా నిలిచారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో రిలీజ్ చేశారు. అందులో.. మీకు ఎలాంటి సహాయం కావాలన్నా డైరెక్ట్ గా మెసేజ్ చేయొచ్చు. లేదా మా ఫౌండేషన్ కు మెసేజ్ చేసినా వెంటనే రెస్పాండ్ అయి మీకు కావాల్సిన సహాయాన్ని అందజేస్తారని తెలిపారు..