Bangladesh: వియత్నాం – బంగ్లాదేశ్ వంటి చిన్న దేశాలు వస్త్ర, తోలు, దుస్తులు ఉత్పత్తుల ఎగుమతిలో భారతదేశాన్ని అధిగమించాయి. చైనా ప్లస్ విధానాన్ని సద్వినియోగం చేసుకోవడంలో భారత్ విఫలమైందని ప్రపంచ బ్యాంకు తన నివేదికలో పేర్కొంది. పై ఉత్పత్తుల ఎగుమతుల్లో భారతదేశం ప్రపంచ వాటా పదేళ్లుగా క్షీణిస్తూ వస్తోంది. భారత ఆర్థిక వ్యవస్థ శరవేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ ప్రపంచ వాణిజ్య వాటా మాత్రం పెరగడం లేదు. తయారీ ఉత్పత్తుల ఎగుమతిలో బంగ్లాదేశ్, వియత్నాం వంటి దేశాలు భారత్‌ను వెనక్కి నెట్టివేస్తున్నాయని ప్రపంచ బ్యాంకు తన నివేదికలో పేర్కొంది. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం, గత దశాబ్దంలో GDP లో వస్తువులు, సేవల పరిమాణ శాతం క్షీణిస్తోంది.
పూర్తిగా చదవండి..Bangladesh: ఆ విషయంలో భారత్ ను మించిపోయిన బంగ్లాదేశ్
వియత్నాం, బంగ్లాదేశ్ వంటి చిన్న దేశాలు ఎగుమతి రంగంలో భారత్‌ను అధిగమిస్తున్నాయి. ఈ మేరకు ప్రపంచ బ్యాంకు ఒక నివేదిక ఇచ్చింది. వస్త్ర, తోలు, దుస్తుల ఉత్పత్తుల ఎగుమతిలో ఈ దేశాలు భారత్ ను మించిపోయాయి. పదేళ్లుగా మన దేశం నుంచి ఈ ప్రోడక్ట్స్ ఎగుమతులు బాగా తగ్గాయి.
Translate this News: