Hyderabad : తుక్కుగూడలో కాంగ్రెస్ బహిరంగ సభ.. ఆ రూట్లలో ట్రాఫిక్ మళ్లింపు హైదరాబాద్‌లోని తుక్కుగూడలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ జరగనున్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి వచ్చే వాహనాదారులకు రాచకొండ సీపీ తరుణ్ జోషి పలు సూచనలు చేశారు. సాయంత్రం నాలుగు నుంచి 9 గంటల వరకు వాహనాదారులు నిబంధనలు పాటించాలని తెలిపారు. By B Aravind 06 Apr 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Tukkuguda : కాంగ్రెస్ పార్టీ(Congress Party) శనివారం హైదరాబాద్(Hyderabad) లోని తుక్కుగూడలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సభా ప్రాంగణానికి వచ్చే వాహనాదారులకు, సాధారణ వాహనాదారులకు రాచకొండ సీపీ తరుణ్ జోషి(Tarun Joshi) శుక్రవారం కొన్ని సూచనలు చేశారు. 'సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు వాహనాదారులు నిబంధనలు పాటించాలని తెలిపారు. నల్గొండ, ఖమ్మం, విజయవాడ రహదారి మీదుగా వచ్చే వాహనాలు.. అంబర్‌పేట్ ఓఆర్‌ఆర్ లేదా సర్వీసు రోడ్డు నుంచి బొంగుళూరు టోల్‌కు వెళ్లే రూట్‌లో రావిర్యాల టోల్‌వద్ద ఎడమవైపుకు తిరగాలి. అక్కడి నుంచి ఫ్యాట్‌సిటీ వద్ద ఏర్పాటుచేసిన పార్కింగ్ స్థలానికి చేరుకోవాలి. Also read: నేడు , రేపు వడగాలులు వీచే అవకాశాలు… ప్రజలు బయటకు రావొద్దు! జాతీయ రహదారి 44 బెంగళూరు నుంచి రాబోయే వాహనాలు పాలమాకుల, స్వర్ణభారతి ట్రస్టు, పెద్ద గోల్కొండ సర్వీసు రోడ్డు నుంచి ఓల్డ్ పీఎం సమావేశం స్థలం వద్ద పార్కింగ్‌కు చేరుకోవాలి. జహీరాబాద్ నుంచి వచ్చే వాహనాదారులు.. పటాన్‌చెరు ఓఆఆ నుంచి గచ్చిబౌలీ, శంషాబాద్ మీదుగా పెద్ద గోల్కొండ వద్ద కిందకు దిగి ఓల్డ్ పీఎం మీటింగ్ స్థలం పార్కింగ్‌కు చేసుకోవాల్సి ఉంటుంది. సిద్ధిపేట నుంచి వచ్చే వాహనాలు.. శామీర్‌పేట ఓఆర్ఆర్ మీదుగా ర్యావిర్యాలకు చేరుకొని ఫ్యాబ్ సిటీ పార్కింగ్‌కు రావాలి. Also Read: కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి ఇక శ్రీశైలం వైపునకు వెళ్లే సాధారణ వాహనాలు రావిర్యాల గ్రామం నుంచి ఎడమవైపు తిరగాలి. అక్కడి నుంచి ఆగాఖాన్ అకాడమీ, విజయా డెయిరీ, తిమ్మాపూర్, రాచులూరు మార్గం గుండా రాచులూరు మీదుగా వెళ్లాలి, శ్రీశైలం హైవే నుంచి హైదరాబాద్‌కు వెళ్లే వారు మహేశ్వరం గేటు వద్ద ఎడమవైపు తిరిగాలి. మన్‌సాన్‌పల్లె, నాగారం, పెద్ద గొల్కొండ నుంచి శంషాబాద్‌కు చేరుకోవాలి. అయితే సభ జరగనున్న నేపథ్యంలో తుక్కుగూడ ఓఆర్‌ఆర్ ఎగ్జిట్ వద్ద సాధారణ వాహనాలను కిందకు దిగేందుకు పర్మిషన్ ఇవ్వారు. ఇక పెద్ద అంబర్‌పేట నుంచి పెద్ద గోల్కొండ దారిలో సాయంత్రం 4 నుంచి రాత్రి 9 గంటల వరకు సాధారణ వాహనాలకు పర్మిషన్ ఉండదు. #cm-revanth #telugu-news #telangana-news #congress #tukkuguda మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి