Mahabubnagar: మహబూబ్‌నగర్ బీజేపీ ఎంపీ టికెట్ కోసం పోటా పోటీ..! మహబూబ్‌నగర్ నుంచి బీజేపీ ఎంపీ టికెట్ కోసం పోటీ నెలకొంది. ఓవైపు డీకే అరుణ, మరోవైపు జితేందర్ రెడ్డిలు నాకంటే నాకే టికెట్ ఇవ్వాలంటూ పార్టీ పెద్దలను కోరుతున్నారు. మరోవైపు ఈసారి బీసీలకు అవకాశం ఇవ్వాలని కల్వకుర్తి ఆచారి పట్టుబడుతున్నట్లు సమాచారం. By B Aravind 09 Jan 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి మరికొన్ని నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అధికార, విపక్ష పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. మూడోసారి అధికారం దక్కించుకోవాలని బీజేపీ, మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని విపక్ష పార్టీలు కసరత్తులు చేస్తున్నాయి. ఇటీవల ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగగా.. ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఉత్తర భారత్‌లో సత్తా చాటుతున్న బీజేపీకి.. దక్షిణ భారత్‌లో అవకాశం రావడం లేదు. ప్రస్తుతం దక్షిణ భారత్‌లో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా బీజేపీకి అధికారం లేదు. ఈ నేపథ్యంలోనే దక్షిణ భారత్‌లో తమ అధికారాన్ని దక్కించుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది కమలం పార్టీ. Also Read: కాళేశ్వరంలో ‘మేఘా’ అవినీతి రూ.50 వేల కోట్లు.. కాగ్ నివేదికలో సంచలన లెక్కలు! ఇదిలాఉండగా ప్రస్తుతం తెలంగాణలో ఎంపీ టికెట్ల కోసం నేతల హడావిడి మొదలైంది. తాజాగా మహబూబ్‌నగర్ బీజేపీ ఎంపీ టికెట్ ఎవరికి దక్కుతుంది అనే అంశం తెరమీదకు వచ్చింది. ఈ టికెట్ కోసం డీకే అరుణ, జితేందర్ రెడ్డిల మధ్య గట్టి పోటీ కనిపిస్తోంది. అయితే ఇప్పటికే డీకే అరుణ తన గ్రౌండ్ వర్క్‌ను మొదలుపెట్టేసింది. 2019లో ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన ఆమె ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. కమలం పార్టీ గుర్తు కింది స్థాయి వరకు వెళ్లకపోవడంతోనే తాను ఓటమి పాలయ్యాయని అరుణ చెబుతున్నారు. అయితే ఇప్పుడు మళ్లీ ఎంపీగా పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు డీకే అరుణ. ఇదిలాఉండగా.. గతంలో బీజేపీ, BRS నుంచి జితేందర్ రెడ్డి ఎంపీగా పనిచేశారు. ఈసారి జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో తనకే ఎంపీ టికెట్ వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పాలమూరు ఎంపీ టికెట్‌పై పార్టీ స్టేట్ ట్రెజరర్ శాంతి కుమార్ సైతం ఆశలు పెట్టుకున్నారు. అలాగే ఈసారి బీసీలకు అవకాశం ఇవ్వాలని కల్వకుర్తి ఆచారి పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. Also read: ధరణిపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. కమిటీ ఏర్పాటు కల్వకుర్తి నుంచి ఆచారి బీజేపీ ఎమ్మెల్యేగా ఆరుసార్లు పోటీచేశారు. అయితే ఈసారి ఎంపీ టికెట్ ఇవ్వాలని ఆయన బీజేపీ పెద్దలను కోరుతున్నట్లు తెలుస్తోంది. అయితే మహబూబ్‌నగర్ నుంచి ఎవరికి బీజేపీ ఎంపీ టికెట్‌దక్కుతుందనేది స్థానికంగా ఆసక్తి నెలకొంది. ఇక తెలంగాణలో ఎంపీ స్థానాల్లో కూడా బీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య గట్టి పోటీ ఉండనుంది. ఇక కేంద్రంలో ఎవరూ అధికారంలోకి వస్తారో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే. #telugu-news #national-news #bjp #2024-lok-sabha-elections మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి