TS: నాగారం గురుకుల పాఠశాలలో 33 మంది బాలికలకు అస్వస్థత
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర మండలం నాగారంలోని మైనారిటీ బాలికల గురుకుల పాఠశాలలో 33 మంది అస్వస్థతకు గురయ్యారు. స్కూల్లో ఫుడ్ తినడం వలనే పిల్లలు అస్వస్థతకు గురయ్యారని తెలుస్తోంది.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర మండలం నాగారంలోని మైనారిటీ బాలికల గురుకుల పాఠశాలలో 33 మంది అస్వస్థతకు గురయ్యారు. స్కూల్లో ఫుడ్ తినడం వలనే పిల్లలు అస్వస్థతకు గురయ్యారని తెలుస్తోంది.
దేశ రాజధానిలో గత కొన్నేళ్ళుగా దీపావళికి బాణాసంచా పేల్చడం నిషేధిస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఈ నిషేధాన్ని శాశ్వతం చేస్తూ ఢిల్లీ గవర్నమెంట్ ఆప్ ప్రకటించింది. తీవ్ర వాయు కాలుష్యం కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు.
సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈరోజు ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఇందులో 21 అంశాలపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో అమరావతి నిర్మాణం కోసం చేసిన ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మూడేళ్లలో నిర్మాణాలు పూర్తి చేసేందుకు మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది.
వాట్సాప్‌లోనూ ఛాట్ జీపీటీ అందుబాటులోకి వచ్చింది. 12 డేస్ ఆఫ్ ఓపెన్ఏఐ అనౌన్స్మెంట్స్లో భాగంగా తన ఏఐ చాట్‌బాట్ చాట్‌జీపీటీని వాట్సప్‌లో ప్రవేశపెట్టింది. వేరే యాప్, అకౌంట్‌తో సంబంధం లేకుండా వాట్సప్‌లోనే చాట్‌జీపీటీని వినియోగించొచ్చు.
పిఠాపురం హాస్పిటల్ అభివృద్ధి కమిటీ ప్రమాణస్వీకారం రసాభాసగా ముగిసింది. వేదిక మీద పవన్ కల్యాణ్ ఫోటో లేదని జనసేన...సీఎం చంద్రబాబు ఫోటో కూడా పెట్టలేదంటూ టిడిపి ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే వర్మ అక్కడి నుంచి వెళ్ళిపోవడం వివాదంగా మారింది.
యుద్ధాన్ని అయితే ఆపింది కానీ గాజాలో ప్రజలను హింసించడం మాత్రం మానలేదు ఇజ్రాయెల్ సైన్యం. అక్కడ జనాలకు తారు నీరు అందించకుండా మారణ హోమం సృష్టిస్తోందని నివేదికలు చెబుతున్నాయి. పాలస్తీనియన్లకు సరిపడా మంచినీరు అందకుండా ఇజ్రాయెల్ అడ్డుపడుతోంది.
ఈరోజు స్టాక్ మార్కెట్ పతనం మదుపర్లకు రక్తకన్నీరు తెప్పించింది. సెన్సెక్స్ మళ్లీ 80వేల దిగువ స్థాయికి చేరగా.. మదుపర్ల సంపద దాదాపు రూ.3 లక్షల కోట్లు ఒక్క సెషన్లో ఆవిరైంది. సెన్సెక్స్ 79,218 దగ్గరా.. నిఫ్టీ 23,951 దగ్గర ముగిసింది.
ముంబయ్ 26/11 ఘాతుకానికి కారణమైన కీలక నిందితుడు తహవూర్ రాణా వేసిన పిటిషన్ ను కొట్టేయాలని అమెరికా సుప్రీంకోర్టును అక్కడి ప్రభుత్వమే కోరింది. ప్రస్తుతం అమెరికాలో శిక్ష అనుభవిస్తున్న రాణా తనను భారత్‌కు అప్పగించ కూడదంటూ పిటిషన్ వేశాడు.
అన్నిటికీ సమాధానం చెబుతా అంటున్నారు కేటీఆర్. ఫార్ములా ఈ కార్ రేస్‌లో స్కామ్ జరిగింది అంటున్నారు...ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే.. దీన్ని అసెంబ్లీలో చర్చించాలి అన్నారు. తనను వీకెండ్ లో అరెస్ట్ చేయాలని..బెయిల్ కూడా వద్దని కేటీఆర్ సంచలన ప్రకటన చేశారు.