నేషనల్ Arvind Kejriwal: జైలు నుంచి బయటకి వచ్చిన సీఎం కేజ్రీవాల్.. లిక్కర్ కేసులో అరెస్టయిన సీఎం కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా కేజ్రీవాల్ జెలు నుంచి విడుదలయ్యారు. దాదాపు ఆరు నెలల పాటు జైలు జీవితం గడిపిన ఆయన ఎట్టకేలకు బయటికొచ్చేశారు. By B Aravind 13 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Vishwambhara : 'విశ్వంభర' టీజర్ కు డేట్ ఫిక్స్.. ఫ్యాన్స్ గెట్ రెడీ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం 'విశ్వంభర'. ప్రసుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి దసరా కానుకగా టీజర్‌ను రిలీజ్ చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇందులో విశ్వంభర ప్రపంచాన్ని పరిచయం చేస్తారని చెబుతున్నారు. By Anil Kumar 13 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss Telugu : 'బిగ్ బాస్ -8' కు రికార్డ్ బ్రేకింగ్ టీఆర్పీ.. 'బిగ్ బాస్' సీజన్ 8 లాంచింగ్ ఎపిసోడ్‌కు ఏకంగా 18.9 టీఆర్పీ వచ్చింది. తెలుగు బిగ్‌బాస్ చరిత్రలో ఇదే అత్యధికం కావడం విశేషం. ఎన్టీఆర్ హోస్ట్ చేసిన మొదటి సీజన్ లాంచింగ్ ఎపిసోడ్‌కు16.18, నాని హోస్ట్ చేసిన రెండో సీజన్ కు 15.05 రేటింగ్ వచ్చింది. By Anil Kumar 13 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ కేంద్రం సంచలన నిర్ణయం.. పోర్ట్ బ్లెయిర్ పేరు మార్పు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రపాలిత ప్రాంతమైన అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్టు బ్లెయిర్ పేరును 'శ్రీ విజయ పురం'గా నామకరణం చేసింది. వలసవాదుల ముద్రల నుంచి విముక్తి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. By B Aravind 13 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చిత్తూరు-బెంగళూరు రహదారిపై మొగిలి గేట్ వద్ద ఓ ఆర్టీసీ బస్సు రెండు లారీలను ఢీకొంది. ఈ విషాద ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. By Vishnu Nagula 13 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ గణేశ్ నిమజ్జనోత్సవం.. సీవీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు హైదరాబాద్‌లో వినాయక నిమజ్జనోత్సం సందర్భంగా 25 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని నగర సీపీ సీవీ ఆనంద్ అన్నారు. అలాగే సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు భద్రత ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. By B Aravind 13 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ ఐదేళ్ల చిన్నారిపై హత్యాచారం.. నిందితుడికి మరణ శిక్ష సంగారెడ్డి జిల్లా భానూర్‌లో గత ఏడాది ఓ ఐదేళ్ల చిన్నారిని అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడికి పోక్సో కోర్టు మరణ శిక్ష విధించింది. అలాగే బాధితురాలి కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. By B Aravind 13 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Kristina Joksimovic : మోడల్ ని ముక్కలుగా నరికి చంపిన భర్త! మాజీ మిస్ స్విట్జర్లాండ్ ఫైనలిస్ట్ అయిన క్రిస్టినా జోక్సిమోవిక్ ను ఆమె భర్త థామస్ చంపాడనే ఆరోపణలు వినిపించడంతో అతనిని అరెస్ట్ చేశారు. బాసెల్ సమీపంలోని బిన్నింగెన్‌లోని వారి ఇంటిలో ఆమెను భర్త ముక్కలు ముక్కలుగా నరికి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. By Bhavana 13 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా హాలీవుడ్ కు వెళ్తున్న 'దేవర'.. రిలీజ్ కు ముందే సరికొత్త రికార్డ్ ఎన్టీఆర్ 'దేవర' మూవీ హాలీవుడ్ కు వెళ్తోంది. లాస్ ఏంజెలిస్‌లో జరగనున్న‘బియాండ్ ఫెస్ట్’లో ఈ మూవీని ప్రదర్శించనున్నారు.సెప్టెంబర్ 26 సాయంత్రం ఈజిప్టియన్ థియేటర్లో ఈ సినిమాను హాలీవుడ్ ప్రేక్షకులు, ప్రముఖులు వీక్షించనున్నారు. By Anil Kumar 13 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn