Asia Cup 2023 Final: రేపే బిగ్‌ ఫైట్‌.. గెలుపు ఎవరిది.!

ఆసియా కప్‌ 2023లో భాగంగా రేపు అంతిమ పోరు జరుగనుంది. ఈ మ్యాచ్‌లో భారత్‌, శ్రీలంక జట్లు టైటిల్‌ కోసం పోటీపడనున్నాయి. ఇరుజట్లను పరిశీలిస్తే శ్రీలంక జట్టు కంటే భారత్‌ అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది. కానీ ఇటీవల శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత టాప్‌ ఆర్డర్‌ చేతులెత్తేయ్యడం అందోళనకు గురిచేస్తోంది.

New Update
Asia Cup 2023 Final: రేపే బిగ్‌ ఫైట్‌.. గెలుపు ఎవరిది.!

India vs Sri Lanka Asia Cup Final 2023: ఆసియా కప్‌ 2023లో భాగంగా రేపు అంతిమ పోరు జరుగనుంది. ఈ మ్యాచ్‌లో భారత్‌, శ్రీలంక జట్లు టైటిల్‌ కోసం పోటీపడనున్నాయి. ఇరుజట్లను పరిశీలిస్తే శ్రీలంక జట్టు కంటే భారత్‌ అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది. కానీ ఇటీవల శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత టాప్‌ ఆర్డర్‌ చేతులెత్తేయ్యడం అందోళనకు గురిచేస్తోంది. అంతే కాకుండా భారత్‌ ప్రధాన ప్లేయర్లు లేకుండా బంగ్లాదేశ్‌తో జరిగిన నామమాత్రపు మ్యాచ్‌లో టీమిండియా టాప్‌ ఆర్డర్‌ బ్యాటర్లు విఫలమయ్యారు. ముఖ్యంగా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (Rohit Sharma), సూర్యకుమార్ యాదవ్‌ (Surya Kumar Yadav), తిలక్‌ వర్మ విఫలం కావడంతో భారత ఆభిమానుల్లో ఆందోళన నెలకొంది.

మరోవైపు కీలక ఇన్నింగ్స్‌ ఆడాల్సిన సమయంలో క్రీజులోకి వచ్చిన సీనియర్‌ ఆల్‌ రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ కాసేపు క్రీజులో ఉన్నా జట్టును గెలిపించలేకపోయాడు. దీంతో భారత్‌ జట్టు పసికూన బంగ్లాదేశ్‌ చేతిలో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో ప్రధాన ఆటగాళ్లు లేకపోవడం, జూనియర్లకు అవకాశాలు ఇవ్వడం, వారు సరైన సమయంలో రాణించకపోవడంతోనే టీమిండియా ఓటమి పాలైనట్లు స్పష్టంగా తెలుస్తోంది. దీంతో రేపు జరుగబోయే అసియా కప్‌ 2023 ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా పాక్‌పై ఆడిన భారత జట్టుతో బరిలోకి దిగబోతోంది.

మరోవైపు భారత్‌కు ఫైనల్‌ ముందు షాక్‌ తగిలింది. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌ గాయపడ్డాడు. శుక్రవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అక్షర్‌ పటేల్‌ స్టంపౌట్‌ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుండగా కుడిచేతి చిటికెన వేలికి గాయమైనట్లు తెలుస్తోంది. అనంతరం అదే మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ ఫీల్డర్‌ విసిరిన బంతి అక్షర్ పటేల్‌ చేతిని తాకింది. ఆ బాల్‌ బలంగా తాకడంతో అతని గాయం మరింత పెద్దదిగా మారింది. దీంతో పట్టీ వేసుకుని మరీ బ్యాటింగ్ చేశాడు. ప్రస్తుతం అక్షర్‌ పటేల్‌ స్థానంలో వాషింగ్టన్ సుందర్ జట్టులోకి వచ్చాడు.

Also Read: ఇదేం ఊచకోత రా బాబూ.. ఏకంగా 36 ఫోర్లు, 20 సిక్సర్లు

Advertisment