Weather Alert: రేపు కేరళను తాకనున్న రుతుపవనాలు.. తెలంగాణ, ఏపీకి ఎప్పుడంటే

రాగల 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నట్లు భారత వాతారణ శాఖ తెలిపింది. కేరళను తాకిన 5 రోజుల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు రుతుపవనాలు విస్తరిస్తాయని పేర్కొంది.

New Update
Telangana : రాష్ట్రంలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు!

రాగల 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నట్లు భారత వాతారణ శాఖ తెలిపింది. ఈ రుతుపవనాల ప్రారంభానికి కేరళలో అనుకూల పరిస్థితి ఉందని అంచనా వేసింది. అలాగే కొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ముందస్తు రుతుపవనాల ప్రభావం ఉంటుందని పేర్కొంది. కేరళను తాకిన 5 రోజుల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ఇవి విస్తరిస్తాయని పేర్కొంది.

Also Read: కార్లు కడిగితే రూ.2000 ఫైన్ .. సర్కార్ షాకింగ్ నిర్ణయం

ఇదిలాఉండగా.. మరోవైపు దేశంలో ఎండలు మండిపోతున్నాయి. ఢిల్లీ అత్యధికంగా రికార్డు స్థాయిలో 50 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇప్పటికే ఢిల్లీతో పాటు ఉత్తరాది రాష్ట్రాలకు అధికారులు రెడ్ అలర్డ్ జారీ చేశారు. పాకిస్థాన్‌లో కూడా 50 డిగ్రీలకు పైగా ఎండలు ఉన్నాయని.. అక్కడి నుంచి వీచే వేడిగాలుల ప్రభావంతో మన దేశంలోని ఉత్తరాది రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతలు రికార్డ్ అవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

Also read: గెలిచాక ఎలా చేద్దాం.. చంద్రబాబు, పవన్ కీలక భేటీ!

అలాగే సూర్యూడు సైతం భూమికి దగ్గరగా రావడం వల్ల ఎండల తీవ్రత పెరిగిందని తెలిపారు. అరేబియా సముద్రంలో అల్పపీడనం వల్ల రెండు, మూడు రోజుల్లో ఉత్తరాది రాష్ట్రాల్లో 3-4 డిగ్రీల ఉష్ణోగ్రతలు తగ్గుతాయని పేర్కొన్నారు. అంతాకాదు జూన్‌ లో కూడా 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని చెప్పారు. ప్రజలు బయటకు వెళ్లేటప్పుడు ఎక్కువగా నీటిని, ఫ్లూయిడ్స్ తీసుకోవాలని సూచిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు