టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ ఈ నెల 31న భేటీ కానున్నారు. ఏపీలో పోలింగ్ ముగిసిన తర్వాత వారు తొలిసారి సమావేశం కానున్నారు. అదే రోజు బీజేపీ నేతలతోను చంద్రబాబు భేటీ అవనున్నారు. పోలింగ్ జరిగిన తీరు, తర్వాత చోటు చేసుకున్న పరిణామాలపై వీరు చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రేపు ఉండవల్లికి చంద్రబాబు వెళ్లనున్నారు. ఈ రోజే విదేశీ పర్యటన నుంచి చంద్రబాబు హైదరాబాద్ వచ్చారు. మరో వైపు జూన్ 3న పవన్ కల్యాణ్ పార్టీ నేతలు, కార్యకర్తలతో కీలక భేటీ నిర్వహించనున్నారు. మంగళగిరిలోని పార్టీ ఆఫీస్లో ఈ మేరకు ఏర్పాట్లు సాగుతున్నాయి. కౌంటింగ్ రోజు విజయవాడలోనే చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఉండనున్నారు.
AP Politics: గెలిచాక ఎలా చేద్దాం.. చంద్రబాబు, పవన్ కీలక భేటీ!
ఎన్నికల అనంతరం తొలిసారి ఈ నెల 31న టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత చంద్రబాబు భేటీ కానున్నారు. కౌంటింగ్ అనంతరం అనుసరించాల్సిన వ్యూహాలపై వీరు చర్చించనున్నారు. అదే రోజు చంద్రబాబు బీజేపీ నేతలతోనూ సమావేశం కానున్నారు.
Translate this News: