Pak vs SA World Cup 2023: వన్డే ప్రపంచ కప్ లో ఈరోజు కీలక మ్యాచ్ జరుగుతోంది. సెమీస్ కోసం పరుగులు పెడుతున్న పాకిస్తాన్ (Pakistan) ఒకవైపు… టాప్ ప్లేస్ కోసం పోటీ పడుతున్న సౌత్ ఆఫ్రికా (South Africa) మరోవైపు. ఈ మ్యాచ్ లో ఎలా అయినా గెలవాలనే పట్టుదలతో ఉంది పాక్ టీమ్. మ్యాచ్ గెలిచి పాయింట్ల పట్టికలో టాప్ లో ఉండాలనుకుంటోంది సౌత్ ఆఫ్రికా. దీంతో ఈ మ్యాచ్ రెండు జట్లకూ కీలకంగా మారింది. పాక్ కనుక దీనిలో ఓడిపోతే దాదాపు సెమీస్ రేస్ నుంచి తప్పుకున్నట్లే అవుతుంది. పైగా లాస్ట్ మ్యాచ్ లో ఆఫ్ఘాన్ చేతిలో ఓడిపోయి తీవ్రంగా విమర్శలు పాలయ్యింది పాక్ టీమ్. దాని నుంచి బయటపడాలంటే అయినా ఈరోజు మ్యాచ్ ను గెలిచి తీరాలి.
పూర్తిగా చదవండి..Pak vs SA: సెమీస్ రేస్ ఒత్తిడిలో పాక్.. అగ్రస్థానం కోసం తలపడుతున్న సౌత్ ఆఫ్రికా
వరల్డ్ కప్ లో నేడు పాకిస్థాన్, దక్షిణాఫ్రికాల మధ్య మ్యాచ్ జరుగుతోంది. పాక్ జట్టు సెమీస్ రేసులో నిలవాలంటే ప్రతీ మ్యాచ్ లో గెలవాల్సిన పరిస్థితి. మరోవైపు భారీ విజయాలతో దూసుకుపోతున్న దక్షిణాఫ్రికా అగ్రస్థానం కోసం పోటీ పడుతోంది. చెన్నైలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
Translate this News: