భారతదేశం నూతన పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల ప్రారంభోత్సవం గురించి యావత్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఆ సయమం రానే వచ్చింది. కొత్త పార్లమెంట్ భవనంలో సమావేశాలు నేటీ నుంచి షురూ కానున్నాయి. ఈ సందర్బంగా పార్లమెంట్ ఔన్నత్యాన్ని మరింత పెంచేవిధంా ప్రధాని మోదీ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. తొలి సమావేశాల సందర్భంగా నేడు ప్రధాని భారత రాజ్యంగం ప్రతీని పాత పార్లమెంట్ భవనం నుంచి కొంత్త భవనానికి తీసుకెళ్తారని పీఎంవో వర్గాలు తెలిపాయి. ఈ ప్రక్రియలో పార్లమెంట్ సభ్యులు కాలినడన ప్రధానిని అనుసరిస్తారు.
ఈ ఏడాది మే 28న మోదీ ప్రారంభించిన కొత్త పార్లమెంట్ కాంప్లెక్స్ లో ఇవాళ్టి నుంచి ప్రత్యేక సమావేశాలు ప్రారంభం అవుతాయి. ప్రారంభానికి ముందు, పాత పార్లమెంట్ కాంప్లెక్స్ వెలుపల ఉదయం 9.30 గంటలకు ఫోటో సెషన్ ఉంటుంది. 1927 జనవరి 18న అప్పటి వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ ప్రారంభించిన పాత పార్లమెంట్ భవనం చారిత్రక వారసత్వంపై ద్రుష్టి సారించే విధంగా సమావేశం జరుగుతుంది. అంతేకాదు 2047 నాటికి భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుతామని ప్రతిజ్ఞ చేస్తారు.
ఇది కూడా చదవండి: భగత్‌సింగ్, నెహ్రు నుంచి మోదీ వరకు.. పాత పార్లమెంట్ భవనం చరిత్ర ఇదే..!
ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ, రాజ్యసభ చైర్మన్ జగ్ దీప్ ధన్ ఖర్, లోకసభ స్పీకర్ ఓం బిర్లా , కాంగ్రెస్ నేతలు మల్లికార్జున ఖర్గే, అధిర్ రంజన్ చౌదరి, మేనకా గాందీ. మన్మోహన్ సింగ్, శింబు సోరేన్, పీయూశ్ గోయల్ హాజరుకానున్నారు. ఈ కార్యక్రమం మధ్యాహ్నం 12.35గంటలకు ప్రారంభం అవుతుంది.
ఈ సమావేశం తర్వాత మోదీ పాత పార్లమెంట్ నుంచి కొత్త పార్లమెంట్ కు మారుతారు. మోదీ రాజ్యంగ ప్రతీని తీసుకుని పాత పార్లమెంట్ భవనం నుంచి కొత్త పార్లమెంట్ భవనం వరకు కాలినడనకన వెళ్తారు. పాతపార్లమెంట్ భవనం నుంచి కొత్త పార్లమెంట్ భవనం వెళ్లే సమయంలో ఎంపీలు కూడా కాలినడకన మోదీని అనుసరిస్తారు. అంతకుముందు కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంలో సెంగెల్ ను ప్రధాని మోదీ అమర్చిన సంగతి తెలిసిందే.
ఇది కూడా చదవండి: ఎంపీల కోసం రాజ్యాంగ ప్రతి, నాణెం.. రేపటి నుంచి కొత్త పార్లమెంట్‌లో సమావేశాలు
షెడ్యూల్ ఇదే:
➼ సెంట్రల్ హాల్ కార్యక్రమం రేపు(సెప్టెంబర్ 19) మధ్యాహ్నం 12:35 వరకు ఉంటుంది
➼ ఉదయం 11 గంటలకు సెంట్రల్ హాల్‌లో ప్రత్యేక ఉభయ సభ.. ఈ సెంట్రల్ హాల్ పాత పార్లమెంటులో ఉంది
➼ రేపు, ప్రధాని మోదీ రాజ్యాంగం కాపీతో పాత పార్లమెంట్ నుంచి కొత్త పార్లమెంట్ వరకు కాలినడకన వెళ్లనున్నారు.
➼ లోక్‌సభ మధ్యాహ్నం 1:15గంటలకు
➼ రాజ్యసభ మధ్యాహ్నం 2:15 గంటలకు ప్రారంభం.