Rohini panel report: బీజేపీ మరో అస్త్రం! OBC రిజర్వేషన్లలో భారీ మార్పులు?
కాంగ్రెస్‌ని డిఫెన్స్‌లో పడేసేందుకు బీజేపీ మరో అస్త్రంతో సిద్ధమైంది. సెప్టెంబర్ 18 నుంచి సెప్టెంబర్ 22 వరకు జరగనున్న పార్లమెంట్ సమావేశాలకు ముందు ఓబీసీ రిజర్వేషన్లపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఓబీసీ(OBC) రిజర్వేషన్లలో మార్పులు తీసుకురానుందని సమాచారం. ఓబీసీ ఉప వర్గీకరణకు సంబంధించి జస్టిస్ రోహిణి కమిషన్ నివేదికను నరేంద్ర మోదీ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని భావిస్తున్నారు. ఈ నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు జూలైలో సమర్పించారు.