IPL 2024 : హైదరాబాద్‌లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్ళింపు

హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఈరోజు ముంబై ఇండియన్స్, సన్ రైజన్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు. దాంతో పాటూ నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు.

New Update
IPL 2024 : హైదరాబాద్‌లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్ళింపు

Hyderabad : హైదరాబాద్‌లో ఇవాళ క్రికెట్(Cricket) సందడితో నిండిపోనుంది. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియం(Rajiv Gandhi Stadium) లో ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. సన్ రైజర్స్(SRH) కు ముంబై ఇండియన్స్(MI) మధ్య ఈరోజు మ్యాచ్ అవనుంది. సాయంత్రిం 7.30గంటలకు ఆట ప్రారంభం అవుతుంది. దీని కోసం ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లూ చేసేశారు. టికెట్లు అన్నీ కూడా నిమిషాల్లో అమ్ముడుపోయాయి. ఇరు జట్లూ హైదరాబాద్‌కు చేరుకున్నాయి. ఈరోజు ఉదయం స్టేడియంలో ప్రాక్టీస్ సెషన్‌లో కూడా పాల్గొన్నాయి.

భారీ భద్రతా చర్యలు...

ఇక మ్యాచ్‌ కోసం హైదరాబాద్ పోలీసులు గట్టి భద్రతా చర్యలు చేపట్టారు. ఎలాంటి అవాంచనీయా సంఘటనలు జరగకుండా 2,500 మంది పోలీస్‌ సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నట్లు రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ తరుణ్‌ జోషి(Tarun Joshi) తెలిపారు. స్టేడియం వద్ద 360 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఉప్పల్ స్టేడియంలో సీటింగ్‌ సామర్థ్యం 39 వేలు. టికెట్లు అన్నీ అధికారికంగా విక్రయించారు. అవి కాకుండా ఎవరైనా బ్లాక్‌లో టికెట్లు అమ్మాలని ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తరుణ్ జోషి తెలిపారు. స్టేడియం లోపల, వెలుపల భారీగా పోలీసులను మోహరించనున్నారు. గ్రౌండ్ లోపలికి ల్యాప్‌ ట్యాప్‌, వాటర్‌ బాటిల్స్‌, బ్యానర్స్‌, లైటర్స్‌, సిగరెట్స్‌, బైనాక్యులర్స్ తీసుకురాకూడదు. బ్లూటూత్స్ మాత్రమే అనుమతిస్తాం అని చెబుతున్నారు.

అలాగే స్టేడియం పరిసరాల్లో షీ టీమ్స్‌(She Teams) నిఘా ఉంటుందని చెప్పారు. మ్యాచ్ కు 3 గంటల ముందు నుంచి ప్రేక్షకులను అనుమతిస్తామన్నారు. ముందస్తు భద్రతకోసం 4 అంబులెన్స్‌లు, మెడికల్‌ టీమ్స్‌, ఫైర్‌ ఇంజిన్లను సిద్ధంగా ఉంచబోతున్నట్లు చెప్పారు. అలాగే స్టేడియం దగ్గర ఎవరికీ ఇబ్బంది కలగకుండా పార్కింగ్‌ సదుపాయం కల్పించామని తెలిపారు.

ట్రాఫిక్ మళ్ళింపు..
భద్రతా చర్యలతో పాటూ ట్రాఫిక్ మీద కూడా దృష్టి పెట్టారు. మ్యాచ్ జరిగినంతసేపూ ఎక్కడా ట్రిఫిక్ ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. భారీ వాహనాలను నియంత్రించనున్నారు. దాంతో పాటూ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11.30 గంటల వరకు ట్రాఫిక్ అంక్షలు ఉంటాయని సీపీ తరుణ్ జోషి తెలిపారు. బోడుప్పల్, చెంగిచెర్ల, పీర్జాదిగూడ నుంచి వచ్చే వాహనాలను హెచ్‌ఎండీఏ భగాయత్ లే అవుట్ ద్వారా నాగోల్ వైపు మళ్ళించనున్నారు. అలాగే నాగోల్ నుంచి వచ్చే వాహనాలు మెట్రోస్టేషన్ నుంచి యూటర్స్ తీసుకుని, భగాయత్ లే అవుట్ నుంచి వెళ్ళాలని సూచించారు. తార్నాక నుంచి వచ్చే వెహికల్స్ హబ్సిగూడ చౌరస్తా నుంచి నాచారం వైపు మళ్ళించనున్నట్లు చెప్పారు. వీటితో పాటూ మెట్రో ట్రైన్‌ సర్వీసులను కూడా పొడిగించనున్నామని తెలిపారు.

Also Read : Andhra Pradesh : నేటి నుంచే వైసీపీ ఎన్నికల శంఖరావం

Advertisment
తాజా కథనాలు