PIL-2024: ధోనీ కోసం కలవరిస్తున్న వైజాగ్ వాసులు..మళ్ళీ మ్యాజిక్ రిపీట్ అవుతుందా?

విశాఖ జనాలు ధోనీ కోసం తెగ ఎదురు చూస్తున్నారు. ఎప్పుడో 2005లో చేసిన మ్యాజిక్ కోసం మళ్ళీ ఆరాటంగా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇవాళ వైజాగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్...చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న చెన్నై ఈ మ్యాచ్‌లో ఏం చేస్తుందో చూడాలి.

PIL-2024: ధోనీ కోసం కలవరిస్తున్న వైజాగ్ వాసులు..మళ్ళీ మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
New Update

Vizag People Waiting Fro Dhoni Magic: ధోని..ధోని...అని అరుస్తున్నారు విశాఖవాసులు. వొక్క వైజాగే కాదు చుట్టుపక్కల ఊళ్ళ వాళ్ళు కూడా అక్కడకు చేరుకుంటున్నారు. విశాఖలోని మధురవాడ ప్రాంతం జనాలతో నిండిపోయింది. సాయంత్రం జరగబోయే చెన్నై సూపర్ కింగ్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ కోసం క్రికెట్ లవర్స్ ఇప్పటి నుంచే స్టేడియం దగ్గరకు చేరుకుంటున్నారు. ఈరోజు రాత్రి 7.30 గంటలకు వైజాగ్ ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో చెన్నై-ఢిల్లీలు తలపడనున్నాయి.

ధోనీ మ్యాజిక్ చేస్తాడా..

అయితే విశాఖ వాసులు ఐపీఎల్ మ్యాచ్ కన్నా ఎక్కువగా ధోనీ కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే దాదాపు 19 ఏళ్ళ క్రితం...అప్పుడే బారత జట్టులోకి అడుగుపెట్టిన ధోనీ ఇక్కడే ఇదే విశాఖ స్టేడియంలో తనెంటో చూపించాడు. తాను బ్యాటింగ్ చేయడం మొదలుపెడితే తన విశ్వరూపం ఎలా ఉంటుందో రుచి చూపించాడు. మిస్టర్ కూల్‌గా అప్పుడు అతను కొట్టిన 149 పరుగులు ఓ సంచలనం. అప్పటి వరకు సాధారణంగా ఆడుతూ వచ్చిన ధోనీ ఒక్కసారిగా చెలరేగిపోయాడు. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ద్రావిడ్‌తో కలిసి పరుగులు వరద పారించాడు. 123 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్స్‌లతో 148 పరుగులు చేశాడు. ఇదే ధోనీ కెరీర్‌ను మలుపు తిప్పిన మ్యాచ్.

ఆమ్యాచ్ గురించి, ధోనీ పెర్ఫామెన్స్ గురించి కథకథలుగా చెప్పుకుంటారు విశాఖ వాసులు. అప్పటివారు తాము ఆ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూశామనుకుంటే...ఇప్పటి వారు మళ్ళీ చూడాలని మాట్లాడుకుంటారు. అయితే ఇప్పుడు ఈరోజు జరుగుతున్నది ఐపీఎల్ మ్యాచ్. అప్పటిలా ధోనీ కానీ ఇంకే బ్యాట్స్ మెన్ గానీ అన్నేసి పరుగులు చేయలేకపోవచ్చును. కానీ అద్భుతాలకు, మెరుపులకు ఐపీఎల్ ఎప్పుడూ పెట్టింది పేరు. అందుకే ఈరోజు మ్యాచ్ కోసం, ధోనీ కోసం విశాఖ వాసులు అంతగా ఎదురు చూస్తున్నారు.

చెన్నై vs ఢిల్లీ...

ఇక ఈరోజు మ్యాచ్ కోసం ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌లు రెండూ వైజాగ్ చేరుకున్నాయి. ఈ రోజు ఉదయం నెట్ ప్రాక్టీస్ కూడా చేశాయి. ఐపీఎల్‌లో ఇంతకు ముందు చెన్నై, ఢిల్లీ జట్లు మొత్తం ౨౯ మ్యాచ్‌లు తలపడగా...అందులో 10 మాత్రమే క్యాపిటల్స్ గెలిచింది. మిగతా 19 మాత్రం చెన్నై ఎత్తుకెళ్ళిపోయింది. దాని ప్రకారం ఇవాళ కూడా సూపర్ కింగ్సే ఫేవరెట్. ఇక వైజాగ్‌లో ఇప్పటివరకు 13మ్యాచ్‌లకు ఆతిధ్యం ఇచ్చింది. ఇక్కడ పిచ్‌ను నిర్ణయించడం కష్టం. ఎందుకంటే జరిగిన మ్యాచ్‌లో ఆరు సార్లు మొదటి బ్యాటింగ్ చేసిన జట్టు గెలిస్తే...ఏడుసార్లు రెండవసారి బ్యాటింగ్ చేసిన జట్టు గెలిచింది. కాబట్టి ఇక్కడ పిచ్‌ను అంచనా వేయడం కష్టం.

ఇక మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఎలా అయినా గెలవాల్సిన పరిస్థితి. ఇప్పటివరకు ఢిల్లీ తన పాయింట్ల ఖాతాను ఓపెన్ చేయలేదు. మరోవైపు చెన్నై ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ విజయం సాధించి మంచి ఫామ్‌లో ఉంది.

#cricket #delhi #ipl-2024 #chennai #vizag
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe