Tilak Varma Achieved a Rare Record: విండీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భారత్ ఖాతా తెరవలేదు. మొదటి టీ20 మ్యాచ్‌లో స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేకపోయిన భారత జట్టు.. ఆదివారం జరిగిన రెండో టీ20లో లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి ఏడు వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో తిలక్ వర్మ హాఫ్ సెంచరీతో అదరగొట్టగా.. మిగిలిన బ్యాటర్లు పెద్దగా రాణించలేకపోయారు. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేక్రమంలో వెస్టిండీస్ టీమ్ 18.5 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టాపోయి టార్గెట్‌ను ఛేదించింది. ఆ జట్టులో పూరన్ (67) పరుగులతో అదరగొట్టాడు.
మరోవైపు టీ20 సీరీస్ ద్వారా అంతర్జాతీ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తెలుగు ఆటగాడు తిలక్ వర్మ సరికొత్త రికార్డు సృష్టించాడు. మొదటి మ్యాచ్‌లో 39 పరుగులు చేసిన తిలక్ వర్మ, రెండవ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. ఈ 50తో తిలక్ వర్మ అరుదైన రికార్డును సాధించాడు. టీ20 ఫార్మాట్‌లో అతి చిన్న వయస్సులో ఆఫ్ సెంచరీ చేసిన ప్లేయర్‌గా తిలక్ చరిత్ర సృష్టించాడు. తిలక్ వర్మకు 20 సంవత్సరాల 271 రోజుల వయసు ఉన్నప్పుడు ఈ రికార్డ్ సాధించడం విశేషం. ఓవరాల్‌గా చిన్న వయస్సుల్లో ఆఫ్ సెంచరీలు సాధించిన క్రికెటర్లను పరిశీలిస్తే.. 20 సంవత్సరాల 271 రోజుల వయసులో తిలక్ వర్మ ఈ రికార్డ్‌ను నమోదు చేయగా.. భారత కెప్టెన్ రోహిత్ శర్మ 2007వ సంవత్సరంలో 21 ఏళ్ల 38 రోజుల వయస్సులో ఈ ఘనత సాధించాడు. రాబిన్ ఉతప్ప 21 ఏళ్ల 90 రోజులకు హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. సురేశ్ రైనా 22 ఏళ్ల 90 రోజులు ఆఫ్ సెంచరీ నమోదు చేసి వరుసగా 3, 4, 5 స్థానాల్లో నిలిచారు.
మరోవైపు తన ఆఫ్ సెంచరీపై స్పందించిన తిలక్ వర్మ తన మొదటి 50ని కెప్టెన్ రోహిత్ శర్మ కుమార్తె సమైరాకి అంకితం ఇస్తున్నట్లు తెలిపాడు. దీనికిగల కారణాన్ని కూడా బ్యాటర్ వెల్లడించాడు. ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్ టీమ్‌తో ఆడుతున్న సమయంలో సమైరాతో అనుబంధం ఏర్పడిందని, అంతర్జాతీయ కెరీర్‌లో నేను చేసే తొలి సెంచరీ లేదా హాఫ్ సెంచరీని సమైరాకి గుర్తుగా ఇస్తానని ప్రామిస్ చేసినట్లు తెలిపాడు. తాను సమైరాతో కలిసి హాఫ్ సెంచరీ సెలబ్రేషన్‌ను జరుపుకుంటానని వెల్లడించాడు. కాగా తిలక్ వర్మ బ్యాంటిగ్ శైలి ఇలాగే కొనసాగిస్తే ఇదే నెలలో ప్రారంభం కానున్న ఆసియా కప్‌లో పాల్గొనే భారత జట్టులో స్థానందక్కే అవకాశం ఉంది. దీంతోపాటు వన్డే వరల్డ్ కప్, టీ20 ప్రపంచకప్‌లో సైతం అతనికి స్థానం కన్ఫామ్ అయినట్లే అని చెప్పుకోవచ్చు