ఆ గ్రామంలో ఆర్మీ ఉద్యోగులే ఎక్కువ, ఇంతకీ అదెక్కడంటే..?
ప్రస్తుతం ఆధునిక సమాజంలో యువత అంతా సాఫ్టువేర్ ఉద్యోగాల వైపుకు పరుగులు తీస్తున్నారు. కానీ ఆ గ్రామంలోని యువత దృష్టంతా ఆర్మీ, నేవి లాంటి ఉద్యోగాలపైనే ఫోకస్ పెట్టింది. మహబూబ్నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండలం వెంకట్రెడ్డిపల్లి గ్రామం. 40 ఏళ్ల క్రితం ఈ గ్రామం నుండి కొంతమంది ఆర్మీ ఉద్యోగానికి ఎంపికయ్యారు. అలా ఇప్పటివరకు దేశం కోసం తమ సేవలను అందిస్తూ జిల్లాలోనే అత్యధిక ఆర్మీ ఉద్యోగులున్న గ్రామంగా రికార్డును సొంతం చేసుకున్నారు.