Success Story : అవమానం సివిల్స్ ర్యాంక్ సాధించేలా చేసింది..ఉదయ్ కృష్ణారెడ్డి సక్సెస్ స్టోరీ ఇదే.!

సివిల్స్ 2023 ఫలితాల్లో ప్రకాశం జిల్లాకు చెందిన ఉదయ్ కృష్ణా రెడ్డి సత్తా చాటాడు. తాజాగా విడుదలైన ఫలితాల్లో 780వ ర్యాంకు సంపాదించాడు. సీఐ అవమానించాడని కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేసి సివిల్స్ సాధించిన ఉదయ్ కృష్ణా రెడ్డి సక్సెస్ స్టోరీ మీకోసం.

Success Story :  అవమానం సివిల్స్ ర్యాంక్ సాధించేలా చేసింది..ఉదయ్ కృష్ణారెడ్డి సక్సెస్ స్టోరీ ఇదే.!
New Update

UPSC Civils Ranker Uday Krishna Reddy Success Story :  అవమానం కొంతమందిని ఉన్నత శిఖరాలను అధిరోహించేలా చేస్తుంది. అవమానించారని లోలోపల కుంగిపోకుండా పట్టుదలతో సివిల్స్ సాధించాడు. సీఐ అవమానించాడని కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేసి సివిల్స్ లో 780వ ర్యాంకు సాధించాడు ఉదయ్ కృష్ణారెడ్డి. 2012లోనే కానిస్టేబుల్ ఉద్యోగానికి సెలక్ట్ అయ్యాడు. 2019 వర్కు ఉద్యోగం చేశాడు. కానీ తోటి ఉద్యోగుల ముందు ఓ సీఐ తీవ్రంగా అవమానించడాన్ని తట్టుకోలేకపోయాడు. దీన్ని ఛాలెంజ్ తీసుకున్న ఉదయ్ కృష్ణారెడ్డి..కీలక నిర్ణయం తీసుకున్నాడు. వెంటనే కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేసి సివిల్స్ కోసం ప్రిపరేషన్ మొదలు పెట్టాడు.  మూడు ప్రయత్నాల్లో విఫలం అయ్యాడు. అయినా ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. నాలుగు ప్రయత్నంలో సివిల్స్ ర్యాంక్ సాధించాడు. 2023 ఫలితాల్లో 780 వ ర్యాంకు సాధించాడు.

ఉదయ్ నేపథ్యం:
ఉదయ్ కృష్ణారెడ్డిది ఏపీలోని ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండ మండలం ఊళ్లపాలెం గ్రామం. చిన్నతనంలో తల్లిదండ్రులు దూరమయ్యారు. నానమ్మ దగ్గర పెరిగాడు. ఈ క్రమంలోనే 2012లో కానిస్టేబుల్ ఉద్యోగం సంపాధించాడు. 7ఏండ్లు సర్వీస్ తర్వాత రాజీనామా చేశాడు. సివిల్స్ కు ప్రిపేర్ అయ్యాడు. నాలుగో ప్రయత్నంలో ర్యాంకు సాధించిన తనను అవమానించిన వారి ముందు సగర్వంగా తలెత్తుకుని నిల్చున్నాడు.

60 మంది పోలీసులు ముందు ఓ సీఐ దారుణంగా అవమానించాడు. వ్యక్తిగతంగా టార్గెట్ చేశాడు. దీంతో కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేసి వెంటనే సివిల్స్ కు ప్రిపేర్ అయ్యాను మూడు సార్లు రాశాను. నాలుగో ప్రయత్నంలో విజయం సాధించాను అంటూ ఉదయ్ కృష్ణారెడ్డి చెప్పుకొచ్చాడు. సివిల్స్ ఫలితాల్లో 780వ ర్యాంకు సాధించిన అతను ఐఏఎస్ కేడర్ కాకుండా ఐఆర్ఎస్ వచ్చే అవకాశం ఉంది. అయితే ఉదయ్ కృష్ణారెడ్డి మాత్రం తన ప్రిపరేషన్ ఆపే ప్రసక్తే లేదంటున్నారు. ఐఏఎస్ కేడర్ కు సెలక్ట్ అవ్వడమే తన లక్ష్యమని చెబుతున్నాడు.

ఇది కూడా చదవండి: అమెరికాలో భారతీయుడిపై రూ.2 కోట్ల రివార్డు.. భార్యను కృరంగా చంపి ఏం చేశాడంటే?

#success-story #andhra-pradesh-news #civils #upsc #ap-jobs #upsc-recruitment
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe