Ambati rambabu: రాష్ట్రంలో విధ్వంసం సృష్టించాలని చూస్తున్నారు

టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నారా లోకేష్‌ కలిసి రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కల్గించాలని చూస్తున్నారని ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆరొపించారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలో తిరుగుతున్న నేతలు ప్రజలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు అధికారం రాదేమో అనే భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు.

New Update
Ambati rambabu: రాష్ట్రంలో విధ్వంసం సృష్టించాలని చూస్తున్నారు

టీడీపీ అధినేత చంద్రబాబుపై ఇరిగేషన్‌ శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టులను సందర్శిస్తున్న చంద్రబాబు తనకు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతూ.. కార్యకర్తలను, ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అంతే కాకుండా శాంతి భద్రతలు కాపాడే పోలీస్‌ అధికారులపై చంద్రబాబు దౌర్జన్యం చేస్తున్నారని అంబటి రాంబాబు ఆరోపించారు. తన కార్యకర్తలతో పోలీసులపై దాడి చేయించారని, పుంగనూరులో టీడీపీ కార్యకర్తల దాడిలో ఓ కానిస్టేబుల్‌ కంటి చూపు పోయే పరిస్థితి వచ్చిందన్నారు. దీనికంతటికీ కారణం చంద్రబాబు నాయుడని అంబటి మండిపడ్డారు.

మరోవైపు నారా లోకేష్‌ యువగలం పేరుతో రాష్ట్రంలో పాదయాత్ర చేపట్టారన్న మంత్రి అంబటి.. దత్త పుత్రుడు వారాహి యాత్ర పేరుతో రాష్ట్రంలో తిరుగుతూ ప్రజలను రెచ్చగొడుతున్నారన్నారు. చంద్రబాబు, లోకేష్‌, పవన్‌ కళ్యాణ్‌ ఈ ముగ్గురు వ్యక్తులు యాత్రలు చేస్తూ తమ ప్రసంగాలతో ప్రజలను రెచ్చగొట్టడమే టార్గెట్‌గా పెట్టుకున్నారన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఆటంకం కల్పించి అల్లర్లు సృష్టించాలని చూస్తున్నారన్నారు. ఏపీలో మణీపూర్‌ లాంటి ఘటనలు సృష్టించాలని చంద్రబాబు తన దత్త పుత్రుడు ప్రయత్నిస్తున్నారని నీటి పారుదల శాఖ మంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో 2024 ఎన్నికల్లో తిరిగి వైసీపీ సర్కారే అధికారంలోకి వస్తుందని అసహనంతో ఉన్న ఈ నేతలు.. ప్రజలను రెచ్చగొట్టి రాష్ట్రంలో అల్లర్లు సృష్టిస్తే తమకు కొంచెం అవకాశం ఉంటుందనే అశతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడాలని చూస్తున్నారని ఆరోపించారు.

చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌ కలిసి ఎన్ని కుట్రలు పన్నినా వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికల్లో మళ్లీ వైసీపీనే అధికారంలోకి వస్తుందని అంబటి ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు రాజకీయాల నుంచి తప్పుకొని ఇంట్లో కూర్చోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కాగా ప్రజల్లో తిరుగుతున్న జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ సినిమా డైలాగులు వేస్తున్నారని మంత్రి గుర్తు చేశారు. రాజకీయాల్లో సినిమా డైలాగులు వేస్తే సీఎం అయిపోతానని పవన్‌ అనుకుంటున్నారన్న అంబటి.. అది ఈ జన్మలో జరగదని తేల్చి చెప్పారు. అభిమానులు సీఎం.. సీఎం.. అని నినాదాలు చేస్తుంటే పవన్‌ నిజంగానే సీఎం అయిపోయినట్లు, సీఎం పదవిలో ఉన్నట్లు కలలు కంటున్నారని, అందుకే సినిమా డైలాగులు వేస్తున్నారన్నారు. చంద్రబాబు రాసిచ్చే స్కృప్ట్‌ లేకుండా పవన్‌ కళ్యాణ్‌ ప్రజల్లోకి రాడని ఎద్దేవా చేశారు. జనసేన అధ్యక్షుడు అసలైన రాజకీయ నాయకుడైతే స్కృప్ట్‌ లేకుండా ప్రజల్లోకి రాగలడా అని ప్రశ్నించారు. మరోవైపు చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌ యువ గలం పాతయాత్రకు ప్రజా స్పందన కరువైందని అంబటి రాంబాబు ఆరోపించారు.

Advertisment
తాజా కథనాలు