Rain Alert in Telangana: పగలంతా ఎండ దంచేస్తుంటే...రాత్రుళ్ళు చలి చంపేస్తోంది. ఇలాంటి టైమ్‌లో వర్షాలు పడతాయని చెప్పింది వాతావరణ శాఖ. తెలంగాణలో ఇవాళ, రేపు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాష్ట్రం మీద ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా అకకడక్కడా చిరు జల్లులు కురిసే అవకాశం ఉందని అంటోంది. ఈ వర్షాలకు సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని...వాతావరణ పరిస్థితులు త్వరత్వరగా మారే పరిస్థితులకు అలవాటు పడాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలను జాగ్రత్తగా కాపాడుకోవాలని చెబుతున్నారు. రోగనిరోధక శక్తిని పెంపొందించుకునేందుకు పరిశుభ్రతను పాటించడం, పోషకాహారం తీసుకోవడం లాంటివి చేయాలని చెబుతున్నారు.
ఉష్ణోగ్రతలు..
ఇక తెలంగాణలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలో నమోదవుతున్నాయని చెబుతోంది వాతావరణ శాఖ. ఖమ్మం, నల్లగొండల్లో మాత్రం కాస్త ఎక్కువగా ఉష్ణోగ్రతలు ఉన్నాయని తెలిపింది. అన్ని రాష్ట్రాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్‌కు చేరింది. అలాగే రాత్రిపూట కూడా హైదరాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల్లో సాధారణం కన్నా 2 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి.
Also Read:Hero Suriya : రామ్ చరణ్ సినిమాలో చిన్న క్యారెక్టర్ అయినా సరే చేస్తాను: సూర్య!