Hero Suriya : రామ్ చరణ్ సినిమాలో చిన్న క్యారెక్టర్ అయినా సరే చేస్తాను: సూర్య! నటుడు సూర్య చరణ్ నటించిన రంగస్థలం సినిమాని చూశానని అందులో చరణ్ నటనకు ఫిదా అయిపోయానని , చెర్రీ సినిమాలో చిన్న క్యారెక్టర్ ఇచ్చినా సరే తనతో నటించేందుకు రెడీ అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. By Bhavana 24 Feb 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Tamil Actor Suriya : తమిళ నటుడు సూర్య(Suriya) గురించి ప్రత్యేకంగా చెప్పానవసరం లేదు. సీనియర్ నటుడు శివకుమార్ కుమారునిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటికీ తన నటనతో అందరిని ఆకర్షించాడు. సింగం సినిమాతో అభిమానులకు మరింత దగ్గరయ్యాడు. కేవలం సినిమాలతోనే కాకుండా స్వచ్చంధ సంస్థల ద్వారా ఎంతో మంది పిల్లల్ని అక్కున చేర్చుకున్ని మనసున్న హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఇదిలా ఉంటే సూర్యతో నటించాలని ఎంతోమంది నటులు కోరుకుంటుంటే...సూర్య మాత్రం తెలుగులో ఓ నటుడి సినిమాలో చిన్న క్యారెక్టర్ ఇచ్చిన చాలు నేను నటిస్తానని చెప్పుకొచ్చారు. ఇంతకు ఎవరూ ఆ నటుడు అనుకుంటున్నారా గ్లోబల్ స్టార్(Global Star) రామ్ చరణ్(Ram Charan). నటుడు సూర్య చరణ్ నటించిన రంగస్థలం(Rangasthalam) సినిమాని చూశానని చెప్పారు. ఆ సినిమాలో చరణ్ నటనకు ఫిదా అయిపోయానని , చెర్రీ సినిమాలో చిన్న క్యారెక్టర్ ఇచ్చినా సరే తనతో నటించేందుకు రెడీ అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఆర్‌ఆర్‌ఆర్ (RRR) సినిమాతో వరల్డ్ వైడ్ గా పేరు తెచ్చుకున్న చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సినిమాలో చరణ్ యాక్టింగ్ కి కానూ ఎన్నో జాతీయ అవార్డులు ఆయనను వెతుక్కుంటూ వచ్చాయి. ఆర్ఆర్‌ఆర్ కంటే ముందు చరణ్ నటించిన రంగస్థలం సినిమా కూడా ఎన్నో అవార్డులను అందుకుంది. ఈ సినిమా చూసిన సూర్య చరణ్ సినిమాలో నటించాలని ఉందని చెప్పడంతో మెగా అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్లు సోషల్ మీడియా(Social Media) లో వైరల్ గా మారాయి. ప్రస్తుతం సూర్య కంగువా అనే సినిమా చేస్తుండగా, చరణ్ గేమ్ చేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. Also Read : గ్యాస్ సమస్య వేధిస్తున్నప్పుడు పెరుగు తినాలా? వద్దా? #rangasthalam #suriya #ram-charan #rrr మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి