TDP: టీడీపీతో లింక్.. 50 శాతం పెరిగిన కంపెనీల షేర్ల ధర జూన్ 4న కౌంటింగ్ రోజున భారత స్టాక్ మార్కెట్ పతనమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ స్టాక్ మార్కెట్ మ మళ్లీ పుంజుకుంది. చంద్రబాబు నాయుడు నిర్ణయం వల్లే స్టాక్‌మార్కెట్‌లో ఈ పెరుగుదల వచ్చిందని టీడీపీ తెలిపింది. అలాగే టీడీపీతో లింక్ ఉన్న కంపెనీల ఒక్కో షేర్ విలువ 50 శాతం పెరిగాయి. By B Aravind 06 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ Uncategorized New Update షేర్ చేయండి జూన్ 4న కౌంటింగ్ రోజున భారత స్టాక్ మార్కెట్ దాదపు రూ. 30 లక్షల కోట్ల వరకు పతనమైన సంగతి తెలిసిందే. బుధవారం, గురువారం స్టాక్ మార్కెట్ మ మళ్లీ పుంజుకుంది. బుధవారం సెన్సెక్స్ 2303 పాయింట్లు పెరిగి 74,382 వద్ద, నిఫ్టీ 736 పాయింట్ల లాభంతో 22,620 వద్ద ముగిశాయి. గురువారం ఉదయం సెన్సెక్స్ దాదాపు 700 పాయింట్ల లాభంతో 75,078 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. మధ్యాహ్నం కూడా ట్రెండ్ పెరుగుతున్నట్లు కనిపించింది. తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయం వల్లే స్టాక్‌మార్కెట్‌లో ఈ పెరుగుదల వచ్చిందని టీడీపీ తెలిపింది. నిన్న(బుధవారం) ఎన్డీయేకు చంద్రబాబు నాయుడు పూర్తి మద్దతు తెలిపారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రేమ్ కుమార్ జైన్ పేర్కొన్నారు. జూన్ 12న చంద్రబాబు నాయుడు ప్రమాణ చేయవచ్చని అన్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీకి కూడా ఆహ్వానం పంపారని తెలిపారు. Also Read: 11న టీడీఎల్పీ భేటీ.. చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఎప్పుడంటే? టీడీపీకి అనుబంధమైన కంపెనీల షేర్లలో పెరుగుదల గురువారం నాటి ట్రేడింగ్‌లో గమనిస్తే టీడీపీకి చెందిన కంపెనీల షేర్లు భారీగా పెరిగాయి. హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్, అమర రాజా ఎనర్జీ & మొబిలిటీ లిమిటెడ్ కంపెనీలు టీడీపీతో ప్రత్యక్ష సంబంధాలను కలిగి ఉన్నాయి. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వ ఏర్పాటులో చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషించడం వల్లే ఈ కంపెనీల షేర్లు పెరగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఒక్కో షేరు 50 శాతం పెరుగినట్లు తెలుస్తోంది. హెరిటేజ్ ఫుడ్స్‌లో చంద్రబాబు కుటుంబం వాటా చంద్రబాబు నాయుడు సతిమణి నారా భువనేశ్వరి.. హెరిటేజ్ ఫుడ్స్‌లో కీలక వాటాదారుగా ఉన్నారు. మార్చి త్రైమాసికం చివరిలో విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ఆమెకు కంపెనీలో 24.37 శాతం (2,26,11,525 షేర్లు) వాటాను కలిగి ఉండగా.. హెరిటేజ్ ఫుడ్స్ ప్రమోటర్లలో చంద్రబాబు కొడుకు నారా లోకేష్ కూడా ఉన్నారు. మార్చి 31 వరకు ఉన్న డేటా ప్రకారం, కంపెనీలో అతనికి 10.82 శాతం వాటా ఉంది. చంద్రబాబు నాయుడు కోడలు నారా బ్రాహ్మణికి 0.46 శాతం, మనవడు దివాన్ష్‌కు 0.46 శాతం వాటా ఉంది. Also Read: పార్లమెంట్‌లోకి 280 కొత్త ఎంపీలు జూన్ 6న హెరిటేజ్ ఫుడ్స్ షేర్లలో 10 శాతం పెరుగుదల కనిపించింది. అప్పర్ సర్క్యూట్‌తో ఈ షేరు గరిష్ఠ స్థాయి రూ.601.60కి ఎగబాకింది. స్టాక్‌కు ఇది 52 వారాల గరిష్ట స్థాయి పెరుగుదల. ఎగ్జిట్ పోల్ మరుసటి రోజు నుండి ఈ షేర్ విలువ దాదాపు 49 శాతం పెరిగింది. మరోవైపు అమర రాజా స్టాక్ కూడా పెరుగుతోంది. ఈ కంపెనీకి టీడీపీతో ప్రత్యక్ష సంబంధం లేదు. అయితే కంపెనీ ఎండీ గల్లా జయదేవ్.. గతంలో టీడీపీ నాయకుడిగా ఉన్నారు. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఈరోజు బీఎస్‌ఈలో అమర రాజా షేరు 8 శాతంపైగా పెరిగి రూ.1,332.75కి చేరుకుంది. గత రెండు రోజుల్లో ఈ స్టాక్ 22 శాతం పెరిగింది. #telugu-news #tdp #stock-market #chandra-babu-naidu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి