Stars behind Pawan victory : వారంతా స్టార్లే.. కానీ వారికి పవన్ కల్యాణ్ అభిమాన నటుడు. కొందరైతే పవన్ ను దేవుడిగా కొలుచుకుంటారు. తాము ఎంతగానో అభిమానించే పవన్ ను ఎన్నికల్లో గెలిపించేందుకు వారంతా నడుం బిగించారు. తమ షూటింగులు పక్కన పెట్టుకుని మరీ పవన్ గెలుపుకోసం కృషి చేసారు. వారి కష్టం వృథా కాలేదు. పవన్ ఘన విజయం సాధించడంతో వారి ఆనందానికి అవథులు లేకుండా పోయింది.
https://rtvlive.com/chiranjeevi-tweet-on-chandrababu-victory-telugu-news/
పవన్ గెలుపు కోసం మెగా కుటుంబం ముందుకు వచ్చింది. నాగబాబు, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ లు ప్రత్యక్షంగా ప్రచారంలో పాల్గొన్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, నేచురల్ స్టార్ నాని పవన్ కు మద్దతు తెలుపుతూ వీడియోలు రిలీజ్ చేసారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. తేజా సజ్జ, రాజ్ తరుణ్ వంటి హీరోలు పవన్ గెలిస్తే మార్పు వస్తుందంటూ మద్దతు పలికారు. ఇక డాన్స్ కొరియోగ్రాఫర్ జానీ, కమెడియన్ పృథ్వీ, టీవీ నటుడు సాగర్ వంటి వారు జోరుగా ప్రచారం చేశారు.
వారధి కోసం వానరులంతా కదిలినట్లు పవన్ ను గెలిపించడం కోసం ఆయన అభిమాన నటులు ముందుకు వచ్చారు. ఎన్నికల ప్రచారంలో పాలు పంచుకున్నారు. జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయినా నటులు ఆటో రామ్ ప్రసాద్, గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్, హైపర్ ఆది పిఠాపురంలో మకాం పెట్టారు. పవన్ ను గెలిపించమని ఇంటింటికీ తిరిగి ప్రచారం చేసారు. ప్రచారం చేయడానికి వచ్చిన వీరిని చూసి చిన్ననటులు అంటూ వైసీపీ నేతలు విమర్శలు చేసినా ధీటుగా సమాధానం ఇస్తూ ప్రచారం కొనసాగించారు.
https://rtvlive.com/nagababu-reacts-on-the-victory-of-nda-alliance-in-ap/
ఒక్కడుగా మొదలైన పవన్ రాజకీయ ప్రయాణంలో ఎందరో ఆయన పక్కన చేరారు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి చెందిన అనేకమంది ప్రముఖులు పరోక్షంగా ఆయనకు మద్దతు పలికారు. పవన్ గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. వారందరి కోరిక..కృషి జనసైనికుల అండదండలే ఆశీస్సులుగా పవన్ ఈరోజు విజయాన్ని అందుకున్నారు. పవన్ గెలుపుపై సినీ నటులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయన వెన్నంటి ఉన్న వారంతా సంబరాలు చేసుకుంటున్నారు.