Chandra babu Naidu: జనసేనతో పొత్తుకు ఇంకా సమయం ఉంది..!

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో టీడీపీ ఎన్నికల బరిలో నిలుస్తుందన్న ఆయన బీజేపీతో పొత్తులు కోసం సమయం మించిపోయిందన్నారు. అయితే తెలంగాణలో ఎన్నికల కోసం కమిటీలు వర్కౌట్ చేస్తున్నాయన్నారు. ఇక జనసేనతో పొత్తుకు ఇంకా సమయం ఉందన్నారు చంద్రబాబు నాయుడు.

Chandra babu Naidu: జనసేనతో పొత్తుకు ఇంకా సమయం ఉంది..!
New Update

TDP Alliance with Janasena: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో టీడీపీ ఎన్నికల బరిలో నిలుస్తుందన్న ఆయన బీజేపీతో పొత్తులు కోసం సమయం మించిపోయిందన్నారు. అయితే తెలంగాణలో ఎన్నికల కోసం కమిటీలు వర్కౌట్ చేస్తున్నాయన్నారు. ఇక జనసేన (Janasena)తో పొత్తుకు ఇంకా సమయం ఉందన్నారు చంద్రబాబు నాయుడు.

అయితే ఏపీ రాష్ట్రాన్ని విభజన తర్వాత ప్రణాళికబద్దంగా అభివృద్ధి చేయాలని భావించానన్నారు బాబు. కాకపోతే మూడు రాజధానుల పేరుతో ఏపీకి అసలు రాజధానియే లేకుండా జగన్ చేశాడని ఆయన మండిపడ్డారు. జగన్ పాలనలో పోలవరం నిర్మాణం ఆగిపోయిందన్నారు. అదే పోలవరం ప్రాజెక్ట్ ను పూర్తిచేసి నదులను అనుసంధానం చేస్తే ఈ రోజు ఏపీ ఉత్తమ రాష్ట్రంగా నిలిచేదన్నారు.

ఇక తనపై ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసుకునేందుకు ఆర్టీఐ వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఆయన ఎద్దేవా చేశారు.జగన్ ప్రభుత్వ అవినీతి, అక్రమాలను ఎండగడుతున్నందుకే తనపై కేసులు పెడుతున్నారని చంద్రబాబు అన్నారు. కేసులతో పాటు తన పై భౌతిక దాడులు కూడా చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.  జగన్ రాజకీయాల్లో ఒక బచ్చ అన్న బాబు..రాజకీయంగా ఆయనకు ఉన్న అనుభవం ఎంత? అని నిలదీశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న పెద్ద సమస్య జగనే అని బాబు ఫైర్ అయ్యారు. రాష్ట్రం బాగుపడాలంటే జగన్ (YS Jagan) ను గద్దె నుండి క్రిందకు దించాల్సిందేనన్నారు ఆయన. టీడీపీ పార్టీ  గేట్లు తెరిస్తే వైస్సార్సీపీ పార్టీలో ఉన్న నాయకులు మా పార్టీ లో చేరడానికి సిద్ధంగా ఉన్నారన్నారు బాబు. కానీ అలా చేస్తే తెలుగుదేశం పార్టీ వైస్సార్సీపీ పార్టీ అవుతుందన్నారు.

కాగా, ఇండియా కూటమికి సరైన లీడర్ లేకపోవడం బీజేపీకి అనుకూల అంశంగా మారిందన్నారు. దీంతో  ఇండియా కూటమి ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి. 1980 నుంచే టీడీపీ జాతీయ కూటమిల్లో భాగంగా ఉందన్నారు బాబు.

ఇది కూడా చదవండి: ములుగులో హీటెక్కుతున్న రాజకీయం.. ఎమ్మెల్యే సీతక్క సంచలన వ్యాఖ్యలు!!

#chandra-babu #tdp #tdp-alliance-with-janasena #pawan-kalyan #janasena #ys-jagan #nara-lokesh #ysrcp
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి