YCP VS Pawan : జనసేనాని పవన్ కల్యాణ్ ఈనాటి గెలుపు వెనుక యుద్ధం ఉంది. ప్రతిరోజు ఓ పోరాటమే చేసారు. అధికార పక్ష నేతల మాటల దాడిని ఎదుర్కున్నారు. వ్యక్తిగత విమర్శలకు పోయి బూతులు తిడుతున్నా మౌనంగా భరించారు. అన్నిటికి కాలం సమాధానం చెబుతుంది అంటారు. పవన్ ని బూతులు తిట్టిన నేతలంతా పరాజయం పాలై గూటికి చేరుకున్నారు. తనని అంతలా ఇబ్బంది పెట్టిన ఆ నేతలకు పవన్ లెక్క తేల్చే టైమ్ మొదలైంది.
కొడాలి నాని..పవన్ కల్యాణ్ ను అనేకసార్లు ధూషించారు. అనరాని మాటలు అన్నారు. పావలా పవన్, షకీలా సాబ్, దత్త పుత్రుడు.. చంద్రబాబుతో కలిస్తే పవన్ గుడ్డలూడదీస్తాం అంటూ అవాకులు, చవాకులు పేలారు.
https://rtvlive.com/is-ycp-gets-opposition-position-telugu/
పేర్ని నాని.. పవన్ ను తిట్టాలంటే ప్రెస్ మీట్ పెట్టాల్సిందే. మా సన్నాసిగాడు.. పీకే గాడు.. ఆ పవన్ గాడు.. నువ్వు పోటుగాడివి ఏంట్రా.. పేకే సన్నాసి అంటూ పేట్రేగి పోయారు. ప్యాకేజ్ స్టార్ అంటూ పదే పదే మాట్లాడారు. ఇక మరో నేత అనిల్ కుమార్ యాదవ్ పవన్ బీమ్లా నాయక్ కాదని బిచ్చం నాయక్ అని విమర్శించారు. పీకే నువ్వేం పీకలేవు.. చంద్రబాబుని అనుసరిస్తున్న హచ్ డాగ్ అంటూ తిట్టిపోశారు. అసలు పవన్ ఎప్పుడు ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదని.. ఆయన ఎవరికీ అర్ధం కారని ఎద్దేవా చేసారు.
ఇక రోజా సంగతి చెప్పాలి చంద్రబాబుని పూనిన చంద్రముఖిలా పవన్ పిచ్చి గంతులు వేస్తున్నాడని.. జీవితంలో ఎమ్మెల్యేకాలేడని విమర్శించారు.సందు దొరికితే చాలు పవన్ ప్రస్తావన తెచ్చి తిట్టి పోశారు. ఇక పవన్ మూడు పెళ్లిళ్ల గురించి వైపీసీ నుంచి మాట్లాడని నేత లేరని చెప్పాలి. ప్రతి ఒక్కరూ పదే పదే పవన్ మూడు పెళ్లిళ్ల ప్రస్తావన తెచ్చి దుర్భాషలాడారు. పవన్ పై మాటల దాడి చేశారు. ఎవరేమన్నా పవన్ సీరియస్ గా తీసుకోలేదు. వారికి సున్నితంగానే సమాధానం చెబుతూ వచ్చారు. వారిని ఎదుర్కోవాలని ప్రయత్నించిన జనసైనికులను వద్దని వారించేవారు.
వైసీపీ నేతలు ఎన్ని మాటలు అన్నా.. పవన్ ఓర్పు వహించారు. సంయమనంతో ముందుకు సాగారు. వారి తిట్లు తనకు దీవెనలుగా భావించారు. ప్రతి ఒక్కరికి టైమ్ వస్తుంది. ఇప్పుడు పవన్ టర్న్ వచ్చింది. తనపై వ్యక్తిగత ధూషణలు చేసిన వైసీపీ నేతలు ఏపీ ఎన్నికలలో ఘోర పరాజయం పాలయ్యారు. పవన్ ను నువ్వు ఏం పీకలేవు అన్న వారంతా ఇంటి దారి పట్టారు. పవన్ కి చెప్పు చూపించిన నేతలు ప్రజలకు తమ ముఖం ఎలా చూపిస్తారో చూడాలి.
https://rtvlive.com/celebrities-congratulate-pawan-kalyan-tweets-viral/