BREAKING: బిల్డింగ్ పైనుంచి దూకిన మహిళ

హైదరాబాద్‌ సన్‌ సిటీలో దారుణం చోటుచేసుకుంది. భర్త వేధింపులు తట్టుకోలేక మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. మూడంతస్తుల బిల్డింగ్‌ పై నుంచి కిందకి దూకింది. అప్రమత్తమైన స్థానికులు యువతిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

New Update
Inter Student: అనుమానాస్పదస్థితిలో ఇంటర్‌ విద్యార్థి మృతి

Hyderabad Crime: భర్త వేధింపులు తట్టుకోలేక మూడంతస్తుల బిల్డింగ్‌ పై నుంచి కిందకి ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన హైదరాబాద్‌ లోని నార్సింగి పోలీసు స్టేషన్‌ పరిధిలోని సన్‌ సిటీలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన రేణుక , ప్రవీణ్‌ కు మూడు నెలల క్రితం పెళ్లైంది.

పెళ్లైనప్పటి నుంచి కూడా భర్త వేధింపులు ఎక్కువకావడంతో తట్టుకోలేని రేణుక బిల్డింగ్‌ పై నుంచి దూకింది. యువతిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు.

యువతిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

Also read: హైదరాబాద్‌ లో భారీ వర్షం..మరో నాలుగు రోజులు ఇలాగే!

Advertisment
తాజా కథనాలు