ఇల్లాలి ప్రాణం తీసిన 'చాయ్'.. టైమ్ కు ఇవ్వలేదని అది కోసేసిన భర్త

మార్నింగ్ టీ ఆసల్యంగా ఇచ్చిందని గొడవపడి భార్యను కత్తితో పొడిచి చంపిన భయంకరమైన సంఘటన ఘజియాబాద్‌ లో జరిగింది. మంగళవారం ఉదయం 8 గంటలకు ధర్మవీర్‌ తన భార్య సుందరి మెడ కోసేయగా అక్కడికక్కడే మరణించింది. కుమారుడి ఫిర్యాదుతో అతన్ని అరెస్టు చేశారు.

New Update
ఇల్లాలి ప్రాణం తీసిన 'చాయ్'.. టైమ్ కు ఇవ్వలేదని అది కోసేసిన భర్త

Ghaziabad : ఉదయం చాయ్(Chai) విషయంలో భార్యతో గొడవపడిన ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. అడిగిన వెంటనే తెచ్చి ఇవ్వలేదని కోపంతో రగిలిపోయిన భర్త కట్టుకున్న భార్యపై విచక్షణ రహితంగా దాడి చేశాడు. అంతటితో ఆగకుండా పదునైన కత్తితో ఆమెను మెడను కోసేశాడు. కళ్లముందే రక్తం మడుగులో కొట్టుకుంటున్న భార్యను చూసి కనికరించకుండా అలాగే వదిలేసి పారిపోయిన సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ లో చోటుచేసుకుంది.

publive-image

ఇది కూడా చదవండి : 20 ఏళ్లుగా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న.. ప్రధాని మోడీ

ఘజియాబాద్(Ghaziabad) పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. డిసెంబర్ 19న మంగళవారం ఉదయం 8 గంటలకు ధర్మవీర్‌, అతని భార్య సుందరి (50) మధ్య టీ తయారు చేసే విషయంలో వాగ్వాదం చోటుచేసుకుంది. ఇద్దరి మధ్య మాట మాట పెరగడంతో మరింత పెద్దదైంది. దీంతో విచక్షణ కోల్పోయిన ధర్మవీర్ ఇంట్లో ఉన్న పదునైన కత్తిలాంటి ఆయుధంతో భార్య మెడపై మూడు నాలుగు సార్లు దాడి చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకుగానే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఇక ఆ తర్వాత మహిళ కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు ధర్మవీర్‌ను అరెస్టు చేసినట్లు తెలిపారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు