Ap Govt: వాలంటీర్ల వ్యవస్థ పై కసరత్తు చేస్తున్న ప్రభుత్వం!

వాలంటీర్ల వ్యవస్థ లో మార్పులు చేర్పులు చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తుంది. వ్యవస్థ పేరును మార్చే యోచనలో ప్రభుత్వం ఉంది. గ్రామ వాలంటీర్ పేరును గ్రామ సేవక్, వార్డు వాలంటీర్ను వార్డ్ సేవక్ మార్చాలని ప్రభుత్వం అనుకుంటుంది.

New Update
Ap Govt: వాలంటీర్ల వ్యవస్థ పై కసరత్తు చేస్తున్న ప్రభుత్వం!

Ap Govt: వాలంటీర్ల వ్యవస్థ లో మార్పులు చేర్పులు చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తుంది. వ్యవస్థ పేరును మార్చే యోచనలో ప్రభుత్వం ఉంది. గ్రామ వాలంటీర్ పేరును గ్రామ సేవక్, వార్డు వాలంటీర్ను వార్డ్ సేవక్ మార్చాలని ప్రభుత్వం అనుకుంటుంది. 50 ఇళ్ల నుంచి ఒక్కొక్క వాలంటర్‌ కి 100 ఇల్లు అప్పజెప్పాలని భావిస్తున్న ప్రభుత్వం.

ఒక్కో వాలంటీర్ కు మూడు సంవత్సరాల కాల పరిమితిని మాత్రమే ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. వాలంటీర్ కంటే మెరుగైన ఉద్యోగాలు వారికి కల్పించాలని ప్రభుత్వం అనుకుంటుంది. వాలంటీర్లకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలకు ప్రిపేర్ చేయాలని ప్రభుత్వం అనుకుంటుంది. సచివాలయం పరిధిలో ఉన్న వాలంటీర్లను పంచాయతీల పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తుంది. సంక్షేమ పథకాల డబ్బుల పంపిణీలు వాలంటీర్లకు సంబంధం లేకుండా ఉండే సేవలు ఇవ్వాలని ప్రభుత్వం అనుకుంటుంది. ఎన్నికల సమయంలో వాలంటీర్లకు ఇచ్చిన హామీ ల గురించి ప్రభుత్వం పరిశీలిస్తుంది.

Also read: మళ్లీ కూలిన మానేరు బ్రిడ్జి

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు