Cricket: శ్రీలంకతో మొదటి వన్డే మ్యాచ్ టై

ఇండియా, శ్రీలంకల మధ్య జరిగిన మొదటి వన్డే మ్యాచ్ టై గా ముగిసింది. 231 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 47.5 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌట్ అయింది.

Cricket: శ్రీలంకతో మొదటి వన్డే మ్యాచ్ టై
New Update

India Vs Sri lanka: టీ20 సీరీస్ అయిపోయింది...ఇప్పుడు శ్రీలంకతో వన్డే సీరీస్ మొదలయింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన మొదటి మ్యాచ్ టైగా ముగిసింది. కొలంబోలో జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో ఎనిమిది వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. నిశాంక(56), దునీత్‌(67) అర్ధ సెంచరీలు చేశారు. ఇండియా బౌలర్లలో అర్ష్‌దీప్‌ సింగ్‌, అక్షర్‌ పటేల్‌ చెరో 2 వికెట్లు తీశారు. సిరాజ్‌, దుబె, కుల్దీప్‌, సుందర్‌ తలో వికెట్‌ పడగొట్టారు. తర్వాత 231 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్‌ ఇండియా 47.5 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌట్‌ అయింది. భారత బ్యాటర్లలో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (58) టాప్‌ స్కోరర్‌. అక్షర్‌ పటేల్‌ (33), కేఎల్‌ రాహుల్‌ (31), శివమ్‌ దూబె(25), కోహ్లీ (24) పరుగులు చేశారు.

మ్యాచ్‌ను మలుపు తిప్పిన శ్రీలంక బౌలర్లు..

చివరి తొమ్మిది ఓవర్లు ఉన్నాయి అన్న పొజిషన్‌లో భారత్ చేతిలో మూడు వికెట్లు ఉన్నాయి, 34 పరుగులు చేయాల్సి ఉంది. క్రీజులో శివమ్ దూబే ఉన్నాడు. దాంతో టీమ్ ఇండియా ధీమాగా ఉంది. ఇలాంటి టైమ్‌లో 5 ఓవర్లు ఉండగా కులదీప్ అవుట్ అయ్యాడు. అప్పటికి భారత్ ఇంకా 18 పరుగులు మాత్రమే చేయాల్సి ఉంది. తరువాత 47వ ఓవర్‌లో దూబె సిక్స్‌ కొట్టడంతోపాటు మొత్తం 10 పరుగులు వచ్చాయి. ఇంకేటి భారత్ గెలిచేసింది అనుకున్నారు అందరూ. ఆ తర్వాతి ఓవర్‌ మూడో బంతికి దూబె ఫోర్‌ కొట్టడంతో స్కోర్‌ సమమైంది. దీంతో టీమ్‌ఇండియా సంబరాల్లో మునిగింది. కరెక్ట్‌గా ఈ సమయంలో లంక అసలంక మాయ చేశాడు. వరుస బంతుల్లో దూబె, అర్ష్‌దీప్‌ను ఎల్బీగా ఔట్‌ చేశాడు. దీంతో భారత్‌ విజయం ముంగిట బోల్తా పడి టైగా ముగించాల్సి వచ్చింది. శ్రీలంక బౌలర్లలో అసలంక, హసరంగా తలో మూడు వికెట్లు తీయగా, వెల్లలాగే 2, ధనంజయ, ఫెర్నాండో ఒక్కో వికెట్‌ తీశారు.

Also Read: USA: డెమోక్రటిక్ అభ్యర్ధిగా కమలా హారిస్ ఖరారు

#cricket #india #sri-lanka #match #odi
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe