Election Commission: ఎంపీ అభ్యర్థుల వ్యయపరిమితిని పెంచిన ఎలక్షన్ కమిషన్! మరికొద్ది రోజుల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల్లో అభ్యర్థులు ఖర్చు చేసే నిధుల గురించి ఎలక్షన్ కమిషన్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఒక్కో అభ్యర్థి గరిష్టంగా రూ. 95 లక్షల వరకు ఖర్చు పెట్టుకోవచ్చని తెలిపింది. By Bhavana 24 Feb 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Elections: మరికొద్ది రోజుల్లో లోక్ సభ(Loksabha) ఎన్నికలు(Elections) జరగనున్నాయి. దీంతో అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటికే ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలను మొదలు పెట్టేసింది. ఎన్నికలు అంటే ఓటర్లను తమ వైపునకు తిప్పుకునేందుకు రాజకీయ నాయకులు బాగానే ఖర్చు పెడతారు. ఈ సమయంలో ఎలక్షన్ కమిషన్ లోక్‌సభ ఎన్నికల అభ్యర్థులు ఎంత ఖర్చుపెట్టాలి అనే దాని మీద ఓ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఒక్కో అభ్యర్థి గరిష్టంగా రూ. 95 లక్షల వరకు ఖర్చు పెట్టుకోవచ్చని వివరించారు. అలాగే ఎన్నికల ప్రచారం కోసం వినియోగించే వాహనాల సంఖ్యను కూడా 5 నుంచి 14 కు పెంచినట్లు వివరించింది. అలాగే ఎంపీగా పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్స్ సమర్పించే సమయంలో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు అయితే రూ.12,500, ఇతర అభ్యర్థులు అయితే రూ. 25 వేలు చొప్పున డిపాజిట్ చేయాలని ఎలక్షన్ కమిషన్ పేర్కొంది. రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోను విడుదల చేసిన 3 రోజుల్లోపు ఆ నామినేషన్ పత్రాలను స్థానిక ప్రాంతీయ భాషతో పాటు హిందీ, ఇంగ్లీష్ భాషల్లో కూడా ఉండేటట్లు చూసుకుని ఈసీ కి అందించాలని స్పష్టం చేసింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3.30 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు సమాచారం. ఎన్నికల సమయంలో వారు ఓటు హక్కును వినియోగించుకునేందుకు మొత్తం 35, 356 పోలీంగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ఈసీ వివరించింది. ఈ ఏడాది ఓటర్ల జాబితా నుంచి సుమారు 6, 36,095 మంది ఓటర్లను తొలగించినట్లు ఈసీ పేర్కొగా, కొత్తగా 10,55,031 మంది ఓటర్లు చేరినట్లు తెలిపింది. ఈసారి తెలంగాణలో ఎన్నికల నియమావళిని మరింత కట్టుదిట్టంగా అమలు చేయడమే కాకుండా ఎన్నికల సమయంలో అక్రమాలకు పాల్పడే వారి పై తగిన చర్యలు తీసుకునేందుకు ప్రణాళికలు రూపొందించాలని రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎలక్షన్ కోడ్ అమల్లోకి రాగానే చేపట్టాల్సిన తనిఖీలు వాటికి సంబంధించిన నిబంధనలన్నింటిని అధికారులకు వివరించారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు మద్యం, నగదు, ఇతర విలువైన వస్తువుల పంపిణీని నియంత్రించాలని సీఈవో అధికారులకు తెలిపారు Also read: దేశంలో తొలి బుల్లెట్ రైలు ఎప్పుడు, ఏ మార్గంలో నడుస్తుందో తెలిపిన రైల్వే మంత్రి! #hyderabad #elections #politics #ceo #election-commission #vikas-raj మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి