ఇంజక్షన్లు ఇచ్చి భార్య, పిల్లల్ని చంపిన డాక్టర్.. ఆ తర్వాత ఏం చేశాడంటే ఓ వైద్యుడు ఇంజక్షన్స్ ఇచ్చి భార్య పిల్లలను చంపిన సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం రాయ్‌బరేలీ జిల్లాలో చోటు చేసుకుంది. కొంతకాలం డిప్రెషన్‌తో బాధపడుతున్న అరుణ్ అనే వ్యక్తి భార్య, పిల్లలు 14 ఏళ్ల కుమార్తె, 5 ఏళ్ల బాబును చంపి చివరకి తాను ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. By srinivas 06 Dec 2023 in క్రైం నేషనల్ New Update షేర్ చేయండి Doctor Kills Wife and Kids : అనారోగ్యంతో ఉన్న ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన ఓ వైద్యుడు (Doctor)దారుణానికి పాల్పడ్డాడు. ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న భార్యను, అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న తన పసి పిల్లలను ఉన్నట్టుండి ఘోరంగా హతమార్చాడు. ఎవరికీ అనుమానం రాకుండా యాంటీబయాటిక్ పేరుతో భార్య, పిల్లల బాడీలోకి పాయిజన్ ఇంజెక్ట్ చేసి నొప్పితెలియకుండా ప్రాణాలు తీశాడు. ప్రస్తుతం ఈ భయంకరమైన సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సంచలనంగా మారింది. Also read :పార్లమెంట్‌ను కూల్చి భారత్‌పై ప్రతీకారం తీర్చుకుంటాం.. ఖలీస్థాన్ ఉగ్రవాది ఈ మేరకు ఉత్తరప్రదేశ్ (Utter Pradesh)లోని రాయ్‌బరేలీ జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకోగా.. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. డాక్టర్ అరుణ్ సింగ్.. రాయ్‌బరేలీలోని లాల్‌గంజ్ ప్రాంతంలో గల మోడ్రన్ రైల్ కోచ్ ఫ్యాక్టరీలో అసిస్టెంట్ డివిజనల్ మెడికల్ ఆఫీసర్ (Assistant Divisional Medical Officer at Modern Rail Coach Factory)గా పనిచేస్తున్నాడు. అతడు ఒక కంటి స్పెషలిస్ట్. అయితే అరుణ్ గత కొన్ని రోజులుగా డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు రాయ్‌బరేలీ ఎస్పీ అలోక్ ప్రియదర్శి తెలిపారు. ఈ క్రమంలోనే తీవ్ర ఒత్తిడికి లోనవుతున్న ఆయన పలుసార్లు ఇంట్లో విచిత్రంగా ప్రవర్తించినట్లు సన్నిహితులు చెప్పారు. అయితే ఉన్నట్టుంది ఇంజక్షన్ల ద్వారా భార్య, పిల్లలు 14 ఏళ్ల కుమార్తె, 5 ఏళ్ల బాబును చంపినట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. ఈ దారుణానికి పాల్పడిన అరుణ్ తర్వాత తను ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు తెలిపిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. #doctor #children #killed #wife #kids మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి