నేడు రాజ్యసభకు ఢిల్లీ సర్వీసెస్ బిల్లు.... విప్ జారీ చేసిన ఆప్, ఇండియా కూటమి పార్టీలు...!

గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ(సవరణ బిల్లు)- 2023ను కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేడు రాజ్యసభలో ప్రవేశ పెట్టనున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో సివిల్ సర్వీసెస్ అధికారుల బదిలీలు, నియామకాలపై అధికారాన్ని లెఫ్ట్ నెంట్ గవర్నర్ కట్టబెట్టేందుకు ఈ బిల్లు రూపొందించింది.

author-image
By G Ramu
New Update
Amit Shah: జమ్మూ కాశ్మీర్‌లో భద్రతపై అమిత్ షా కీలక సమావేశం

Delhi Services Bill: గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ(సవరణ బిల్లు)- 2023ను కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేడు రాజ్యసభలో (Rajya Sabha) ప్రవేశ పెట్టనున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో సివిల్ సర్వీసెస్ అధికారుల బదిలీలు, నియామకాలపై అధికారాన్ని లెఫ్ట్ నెంట్ గవర్నర్ కట్టబెట్టేందుకు ఈ బిల్లు రూపొందించింది. దీన్ని ఢిల్లీలోని కేజ్రీవాల్ సర్కార్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

ఢిల్లీలో సివిల్ సర్వీసెస్ అధికారుల నియామకాలు, బదిలీల అధికారాన్ని లెఫ్ట్ నెంట్ గవర్నర్ కు కట్టబెడుతూ ఈ ఏడాది మే 19న కేంద్రం ఒక ఆర్డినెన్స్ ను తీసుకు వచ్చింది. ఇప్పుడు ఆర్డినెన్స్ స్థానంలో బిల్లును ప్రవేశ పెట్టి చట్టంగా తీసుకు రావాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీనిపై ఢిల్లీ సర్కార్ తీవ్రంగా ఫైర్ అయ్యింది. ఈ బిల్లును వ్యతిరేకించాలని, బిల్లును అడ్డుకునే విషయంలో పలు పార్టీల నేతలను కలుసుకుని వారి మద్దతును కేజ్రీవాల్ కోరుతున్నారు.

ఇటీవల విపక్ష ఎంపీల ఆందోళనల నడుమ ఈ బిల్లుకు లొక్ సభలో ఆమోదం తెలిపింది. బిల్లుపై చర్చ సందర్భంగా ఆప్, విపక్షాలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఢిల్లీకి సంబంధించిన చట్టాలు చేసే అధికారం పార్లమెంట్ కు ఉందని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎలాంటి అభ్యంతరాలు వచ్చినా అదంతా కేవలం రాజకీయ పార్టీల దురుద్దేశంతోనేనన్నారు.

ఇక రాజ్యసభలో ఇవాళ ఈ బిల్లు ప్రవేశ పెట్టనుండటంతో ఆప్, కాంగ్రెస్, ఇతర పార్టీలు అలర్ట్ అయ్యాయి. ఆయా పార్టీలు తమ సభ్యులకు విప్ జారీ చేశాయి. బిల్లు ప్రాధాన్యత దృష్ట్యా తమ పార్టీ సభ్యులు ఈ నెల 7,8 తేదీల్లో రాజ్యసభకు ఖచ్చితంగా హాజరు కావాలని ఆప్ విప్ జారీ చేసింది. ఇక సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు ఇండియా కూటమి సభ్యులు మల్లికార్జున ఖర్గే కార్యాలయంలో ఇవాళ ఉదయం 10 గంటలకు సమావేశం కానున్నారు.

Advertisment
తాజా కథనాలు