తెలుగు రాష్ట్రాల్లో మహిళలు, బాలికల మిస్సింగ్ వెల్లడించిన కేంద్రం

New Update
తెలుగు రాష్ట్రాల్లో మహిళలు, బాలికల మిస్సింగ్ వెల్లడించిన కేంద్రం

దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 2019 నుంచి 2021 మధ్య మహిళలు, బాలికల మిస్సింగ్ పై ఇవాళ రాజ్యసభకు కేంద్ర హోంశాఖ వివరాలు వెల్లడించింది. రాజ్యసభలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్రహోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రా లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో గడిచిన మూడేళ్లలో 72,767 మంది అదృశ్యమైనట్లు కేంద్రం పేర్కొంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఏటా వేల సంఖ్యలో బాలికలు, మహిళలు అదృశ్యమవుతున్నారని హోంశాఖ వెల్లడించింది.

మూడేళ్లలో రెండు తెలుగు రాష్ట్రాల్లో అదృశ్యం అయినా మహిళలు, బాలికల వివరాలు :

ఆంధ్రప్రదేశ్:

2019లో 2,186 మంది బాలికలు, 6,252 మంది మహిళలు
2020లో 2,374 మంది బాలికలు, 7,057 మంది మహిళలు
2021లో 3,358 మంది బాలికలు… 8,969 మంది మహిళలు అదృశ్యం అయ్యారు.

ఏపీలో 2019 నుంచి 2021 వరకు మూడేళ్ల కాలంలో మొత్తం 7,928 బాలికలు, 22,278 మహిళలు అదృశ్యమైనట్లు పేర్కొంది.

తెలంగాణ:

2019 లో 2,849 మంది బాలికలు, 10,744 మంది మహిళలు
2020లో 2,232 మంది బాలికలు, 10,917 మంది మహిళలు
2021 లో 2,994 మంది బాలికలు, 12,834 మంది మహిళలు అదృశ్యం అయ్యారు.

ఈ మూడేళ్లలో తెలంగాణలో 8,066 మంది బాలికలు, 34,495 మహిళలు అదృశ్యం అయ్యారని కేంద్రం వెల్లడించింది.

కాగా ఆంధ్రప్రదేశ్ లో భారీ ఎత్తున మహిళలు అదృశ్యం కావడానికి వాలంటీర్లు తీసుకుంటున్న డేటాయే కారణమని గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపణలు చేశారు. దీనిపై వైసీపీ ప్రభుత్వంతో పాటు మహిళా కమిషన్ కూడా తీవ్రంగా స్పందించాయి.

ఐబీ పవన్ కళ్యాణ్ కు డేటా ఎలా ఇచ్చిందని కూడా ప్రశ్నించాయి. మరి ఇప్పుడు కేంద్రమే పార్లమెట్ సాక్షిగా అదృశ్యమైన వారి వివరాలు తెలిపింది. మరి దీనికి వైసీపీ నేతలు ఏం సమాధానం చెప్తారని జనసేన శ్రేణులు ప్రశ్నిస్తున్నారు.

ఏపీ మహిళా కమిషన్ ఏ విధంగా స్పందిస్తుంది?

కేంద్ర హోం వ్యవహారాల సహాయ మంత్రి శ్రీ అజయ్ కుమార్ మిశ్రా బుధవారం రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో ఈ క్రింది విధంగా సమాధానమిచ్చారు. 2019 నుంచి 2021 వరకు మూడు సంవత్సరాలలో, ఆంధ్రప్రదేశ్ నుంచి మొత్తం 30,196 మంది మహిళలు, బాలికలు అదృశ్యమయ్యారు. 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న బాలికలు 7918 మంది, 18 ఏళ్లు పైబడిన మహిళలు 22,278 మంది అదృశ్యమయ్యారు.

గణాంకాలను నిశితంగా పరిశీలిస్తే, మన ఆంధ్రప్రదేశ్‌ లో తప్పిపోయిన బాలికలు, మహిళల సంఖ్య పెరుగుతున్న ధోరణిలో ఉంది. మన అమ్మాయిలు, మహిళలు ఎందుకు తప్పిపోయారు? వారికి ఏమి జరుగుతోంది? ఎవరు బాధ్యత తీసుకుంటారు? రేపు ఏపీ మహిళా కమిషన్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి దీనిపై బహిరంగంగా మాట్లాడుతుందా? ఏపీ మహిళా కమిషన్ హోం శాఖ, డీజీపీని వివరణ కోరుతుందా? ఎట్టకేలకు వైసీపీ ప్రభుత్వాన్ని ఏపీ మహిళా కమిషన్ ప్రశ్నిస్తుందా? ఈ అంశంపై హోంమంత్రి, డీజీపీ స్పందించాలని జనసేన డిమాండ్‌ చేస్తోంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు