Thalapathy69 : ఇద్దరు స్టార్ హీరోయిన్లతో విజయ్ రొమాన్స్.. తలపతి లాస్ట్ మూవీలో నటించేది వీళ్లేనా?

కోలీవుడ్ స్టార్ తలపతి విజయ్ తన లాస్ట్ ప్రాజెక్ట్ ని హెచ్.వినోద్ తో చేయబోతున్నాడు. ఈ సినిమాలో విజయ్ తో సమంత, కీర్తి సురేష్ ఇద్దరూ జతకట్టబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Thalapathy69 : ఇద్దరు స్టార్ హీరోయిన్లతో విజయ్ రొమాన్స్.. తలపతి లాస్ట్ మూవీలో నటించేది వీళ్లేనా?
New Update

Thalapathy Vijay Last Movie : కోలీవుడ్ స్టార్ తలపతి విజయ్ లాస్ట్ మూవీకి సంబంధించి తమిళ మీడియాలో రోజుకో వార్త హల్చల్ చేస్తోంది. రీసెంట్ గానే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన విజయ్ ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో 'ది గోట్' అనే సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఈ సినిమా తర్వాత తన లాస్ట్ ప్రాజెక్ట్ ని హెచ్.వినోద్ తో చేయబోతున్నాడు. అజిత్ తో వలిమై, తునీవు వంటి హిట్ సినిమాలని తెరకెక్కించిన ఈయన.. విజయ్ కోసం ఓ పొలిటికల్ స్టోరీని రెడీ చేసినట్లు తెలిసింది.

publive-image

విజయ్ చేయబోయే చివరి సినిమా ఇదే అని ఎన్నో రోజులుగా ప్రచారం జరుగుతున్నా ఈ ప్రాజెక్ట్ పై ఇంకా ఎలాంటి అనౌన్స్మెంట్ ఇవ్వలేదు. అయితే ఈ సినిమాలో నటించే హీరోయిన్స్ గురించి కోలీవుడ్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇప్పటికే పలువురు హీరోయిన్ల పేర్లు వినిపించగా.. తాజాగా ఈ సినిమాలో విజయ్ తో సమంత, కీర్తి సురేష్ ఇద్దరూ జతకట్టబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

publive-image

సమంత విజయ్ తో ఇప్పటికే కత్తి, తేరి, మెర్సల్ వంటి సినిమాల్లో నటించింది. అటు కీర్తి సురేష్ సైతం భైరవ, సర్కార్ సినిమాల్లో విజయ్ తో జత కట్టింది. ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరు హీరోయిన్స్ విజయ్ లాస్ట్ మూవీలో నటించబోతున్నారట. ప్రస్తుతానికి దీనిపై అధికారిక సమాచారం లేకపోయినా కోలీవుడ్ సర్కిల్స్ లో ఈ వార్త జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి దీనిపై క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

publive-image

తమిళ అగ్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఈ ప్రాజెక్ట్ ని నిర్మించనున్నట్లు తెలుస్తోంది. నిజానికి మొదట ఈ ప్రాజెక్ట్ ని DVV ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై DVV దానయ్య నిర్మించాల్సింది. కానీ పలు అనివార్య కారణాల వల్ల దానయ్య ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోగా.. ఆస్థానంలో సన్ పిక్చర్స్ నిర్మాణ బాధ్యతలు తీసుకున్నట్లు సమాచారం.

publive-image

Also Read : ‘రామాయణ’ సెట్స్ నుంచి రన్ బీర్, సాయి పల్లవి లుక్స్ లీక్.. నెట్టింట వైరల్

#thalapathy69 #keerthi-suresh #samantha #thalapathy-vijay
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe