TGSRTC Jobs: నిరుద్యోగులకు అలర్ట్.. ఆర్టీసీలో 3,305 ఉద్యోగాలపై కీలక అప్‌డేట్‌!

టీజీఎస్‌ఆర్టీసీలో 3,305 ఉద్యోగాల భర్తీ చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నియామకాలను తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్, పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు, మెడికల్‌ బోర్డుల ద్వారా చేపట్టాలని ఆర్టీసీ సంస్థ నిర్ణయం తీసుకుంది.

New Update
Hyderabad:ఆర్టీసీ బస్సులో మహిళ ఆగమాగం..కండక్టర్ ను కాలితో తన్నిన వైనం

టీజీఎస్‌ఆర్టీసీలో 3,305 ఉద్యోగాల భర్తీపై రాష్ట్ర సర్కార్‌ పర్మిషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై ఆర్టీసీ సంస్థ దృష్టి సారించింది. గతంలో కూడా ఆర్టీసీనే సొంతంగా ఉద్యోగాలు భర్తీ చేసింది. కానీ ఈసారి మాత్రం ఇతర సంస్థలకు అప్పగించాలని రేవంత్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేసింది. మొత్తం 11 రకాల ఉద్యోగాల పోస్టులను మూడు విధాలుగా వర్గీకరించింది. ఈ నియామకాలను తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్, పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు, మెడికల్‌ బోర్డుల ద్వారా చేపట్టాలని నిర్ణయం తీసుకుంది.

Also Read: తెలంగాణలో పంటల సాగు @46 లక్షల ఎకరాలు

ఇలా ఆర్టీసీ రూపొందించిన ప్రతిపాదనలు.. రవాణశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆర్టీసీ ప్రతిపాదనలకు ప్రభుత్వం నుంచి కూడా గ్రీన్‌ సిగ్నల్ వచ్చింది. మరో విషయం ఏంటంటే ఆర్టీసీలో పన్నెండేళ్ల తర్వాత ఉద్యోగాల నియామకాలు జరగనున్నాయి. జూనియర్ అసిస్టెంట్ పోస్టులు తప్ప వివిధ రకాల ఉద్యోగాల భర్తీని ఉమ్మడి ఏపీలో 2012లో చివరిసారిగా చేపట్టారు. అప్పుడు కూడా ఆర్టీసీ సంస్థే నియామకాలు చేపట్టింది. మూడేళ్ల క్రితం జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి మాత్రం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేపట్టింది.

చాలాకాలం నుంచి ఆర్టీసీ ఉద్యోగాల నియామకాలు లేకపోవడంతో.. సంస్థలో పెద్దఎత్తు ఖాళీలున్నాయి. డ్రైవర్లు, కండక్టర్లు, శ్రామిక్‌లు, సూపర్‌వైజర్లు, డిపో మేనేజర్లతో పాటు వివిధ విభాగాల్లో 11 వేల వరకు ఖాళీలు ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా డ్రైవర్ల కొరత ఎక్కువగా ఉంది. చాలా డిపోల్లో డ్రైవర్లు అదనపు గంటలు పనిచేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలా డబుల్‌డ్యూటీలు చేసేవారికి యాజమాన్యం ప్రోత్సహకాలు కూడా అందిస్తోంది. అయినా కూడా సమస్యలు తీరడం లేదు. సర్వీసులో మృతి చెందిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల ద్వారా అవకాశం ఇస్తుండగా.. ఇలా మొత్తం వెయ్యిమంది కండక్టర్లు రానున్నట్లు సమాచారం. అందుకే తాజా నియామకాల్లో కండక్టర్ పోస్టులు చేర్చలేదని ఓ అధికారి చెప్పారు.

Also Read: గ్రూప్-1 అభ్యర్థులకు అలర్ట్.. మెయిన్స్ కు ఎంపికపై కమిషన్ కీలక నిర్ణయం!

పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు కింద భర్తీ చేయనున్న ఉద్యోగాలు
డ్రైవర్‌ పోస్టులు : 2000
శ్రామిక్ : 743
డిప్యూటీ సూపరింటెండెంట్‌ (ట్రాఫిక్‌) : 84
డిప్యూటీ సూపరింటెండెంట్‌ (మెకానికల్‌) : 114

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కింద భర్తీ చేయనున్న ఉద్యోగాలు

డిపో మేనేజర్‌/అసిస్టెంట్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌ పోస్టులు : 25
అసిస్టెంట్‌ మెకానికల్‌ ఇంజినీర్‌ : 15
అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (సివిల్‌) : 23
సెక్షన్‌ ఆఫీసర్‌ (సివిల్‌) : 11
అకౌంట్స్‌ ఆఫీసర్‌ : 6

మెడికల్, హెల్త్‌ సర్వీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు కింద భర్తీ చేయనున్న ఉద్యోగాలు
మెడికల్‌ ఆఫీసర్‌ (జనరల్‌) : 7
మెడికల్‌ ఆఫీసర్‌ (స్పెషలిస్ట్‌) : 7

Advertisment
తాజా కథనాలు