Fake Ginger Garlic Paste In Hyderabad: కల్తీ..కల్తీ...ఎక్కడ చూసినా ఎందులో చూసినా మోసం. పరిస్థితులను తమకు అనువుగా మార్చుకుంటూ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు కొందరు వ్యాపారస్తులు. తాజాగా నకిలీ అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ను అమ్ముతూ దొరికిపోయారు. గత కొంతకాలంగా అల్లం, వెల్లుల్లి రేట్లు బాగా పెరిగిపోయాయి. దీంతో వాటిన ఇఎవరూ పెద్దగా కొనుగోలు చేయడం లేదు. అయితే ఈ నేపథ్యంలో అల్లం, వెల్లుల్లి పేస్ట్‌కు మాత్రం బాగా డిమాండ్ పెరిగింది. అల్లం, వెల్లుల్లి విడివిడిగా కొనుక్కోవడం కంటే పేస్ట్ చీప్‌గా దొరుకుతుండడంతో జనాలు దాని వైపే మొగ్గు చూపుతున్నారు. ఈ విషయాన్ని క్యాష్ చేసుకోవాలనుకున్నారు కొందరు దుర్మార్గులు. నకిలీ అల్లం, వెల్లుల్లి పేస్ట్‌లను అమ్ముతూ ప్రజలను మోసం చేస్తున్నారు.
హైదరాబాద్‌లో భారీగా నకిలీ అల్లం, వెల్లుల్లి పేస్ట్..
రీసెంట్‌గా హైదరాబాద్‌లో భారీ మొత్తంలో నకిలీ అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 3.5 టన్నుల పేస్ట్‌ను పట్టుకున్నారు. దీన్ని కిరాణా దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. ఈ అల్లం, వెల్లుల్లి ముద్దను సింథటిక్ ఫుడ్ కలర్, గమ్ పౌడర్, సోడియం బెంజోయేట్ మరియు కుళ్ళిన వెల్లుల్లి తొక్కలతో తయారు చేస్తున్నారు. రోషన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అనే పేరుతో అమ్ముతున్నారు. మాస్ డైమండ్ అనే పేరుతో కూడా ఇదే నకిలీ పేస్ట్‌ను అమ్ముతున్నారు. హైదరాబాద్‌లోని కాటేదాన్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఒక గోడౌన్‌లో దీన్ని తమారు చేస్తున్నారు. ఇక్కడే రూ. 2,80,00 విలువైన గమ్ పౌడర్, సింథటిక్ ఫుడ్ కలర్, ప్యాకేజింగ్ మెటీరియల్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు రాజేంద్రనగర్ పోలీసులు. ఈ మొత్తం వ్యవహారాన్ని చార్మినార్‌కు చెందిన 34 ఏళ్ళ మహ్మద్ అహ్మద్ నిర్వహిస్తున్నాడు.
Also Read:Delhi: ఢిల్లీ బోరు బావిలో పడింది చిన్నారి కాదు..20 ఏళ్ళ యువకుడు