AP TET Revised Schedule: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) షెడ్యూల్‌లో ఏపీ ప్రభుత్వం మార్పులు చేసింది. జులై 2న విడుదలైన నోటిఫికేషన్ ప్రకారం ఆగస్టు 5 నుంచి 20వ తేదీ వరకు టెట్ జరగాల్సి ఉంది. కానీ ఆ పరీక్షలను అక్టోబర్ 3 నుంచి 20 వరకు నిర్వహిస్తామని ప్రభుత్వం తెలిపింది. పరీక్షకు సిద్ధమయ్యేందుకు సమయం కావాలని అభ్యర్థుల వినతి మేరకు సవరించిన నోటిఫికేషన్‌ను ఈరోజు విడుదల చేసింది. 16,347 టీచర్ పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదించిన సంగతి తెలిసిందే.
కొత్త టెట్ రూల్స్
పరీక్ష ఫీజు చెల్లింపు : ఆగస్టు 3 వరకు అవకాశం
ఆన్‌లైన్ దరఖాస్తు గడువు : ఆగస్టు 3
ఆన్‌లైన్ మాక్‌టెస్ట్ : సెప్టెంబర్ 19 నుంచి
పరీక్షలు : అక్టోబర్ 3 నుంచి 20 వరకు ( రెండు సెషన్లలో )
పరీక్ష ప్రాథమిక కీ విడుదల : అక్టోబర్ 4
ప్రాథమిక కీ పై అభ్యంతరా స్వీకరణ : అక్టోబర్ 5 నుంచి
తుది కీ విడుదల : అక్టోబర్ 27
ఫలితాలు విడుదల : నవంబర్ 2