/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/raj.jpg)
Election Campaign Last Day : ఎన్నికల ప్రచారంలో చివరి రోజు శనివారం సాయంత్రం అన్నమయ్య జిల్లా(Annamayya District) రాజంపేట(Rajampet)లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. టీడీపీ- వైసీపీ(TDP-YCP) నాయకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పోలి పంచాయితీ చిన్నిళ్లుగారిపల్లెలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.ఈ దాడుల్లో టీడీపీ నాయకులు ఇద్దరికి, వైసీపీ నాయకులు నలుగురికి గాయాలు అయ్యాయి.
గాయపడిన వారిని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. దీంతో ఆసుపత్రి వద్ద గుమికుడిన ఇరుపార్టీ నాయకులు,పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఇరుపార్టీ నాయకులను పోలీసులు ఆసుపత్రి ఆవరణ నుంచి పంపిస్తున్నారు. ఓట్లకు డబ్బులు పంపకం విషయంలో ఘర్షణ చోటుచేసుకున్నట్లు సమాచారం.