Palnadu: ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లాలో చాలా చోట్ల ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. పోలింగ్ సమయానికే మొదలైంది. కానీ అది స్టార్ట్ అవ్వకముందే అక్కడ కొన్ని చోట్ల వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ జరిగింది. రెంటాల, పాకాలపాడు, ధూళిపాళ్ళ గ్రామాల్లో రాళ్ళు, కర్రలతో దాడి చేసుకున్నారు. ఇందులో కొందరికి తలలు కూడా పగిలాయి. ఈసీ జోక్యం చేసుకునే వరకు వెళ్ళింది వ్యవహారం. వెంటనే పరిస్థితిని అదుపు చేయాలని ఎన్నికల సంఘం పోలీసులను ఆదేశించింది. అవసరమైతే కేంద్ర బలగాలను రప్పించాలని చెప్పింది.
మరోవైపు ఇదే జిల్లాలో రెంటాడలో కూడా గొడవలు జరిగాయి. పోలింగ్ నిలిచిపోయింది, అక్కడ టీడీపీ ఏజెంట్లు...పోలింగ్ కేంద్రాల ముందు బైఠాయించారు. తమపై దాడులు చేస్తున్నారంటూ పోలింగ్ జరగకుండా అడ్డకుంటున్నారు. దీంతో అక్కడ పోలింగ్ ప్రక్రియ ఆగిపోయింది. ఎంతసేపటిలో మొదలవుతుందో తెలియడం లేదు, సస్పెన్స్ కొనసాగుతోంది.