Weather Alert : రాష్ట్రంలో రాబోయే రెండు రోజులు వడగాల్పులు..

తెలంగాణలో రాబోయే మరో రెండు రోజుల పాటు వడగాలులు వీచే అవకాశాలున్నాయని హెదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు చేరే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

New Update
Weather Alert : రాష్ట్రంలో రాబోయే రెండు రోజులు వడగాల్పులు..

Hail In Telangana : రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు(Temperatures) రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఏప్రిల్, మే నెలలు రాకముందే మార్చిలోనే ఎండలు(Heat) దంచికొట్టాయి. పలు ప్రాంతాల్లో దాదాపు 40 డిగ్రీల సెల్సియస్‌కి పైగా నమోదయ్యాయి. ఉదయం నుంచే ఎండలు మండిపోతున్నాయి. ఇక రాబోయే మరో రెండు రోజుల పాటు వడగాలులు(Hail) వీచే అవకాశాలున్నాయని హెదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సోమవారం, మంగళవారాల్లో హీట్‌వేవ్ పరిస్థితులు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపింది.

Also Read : మళ్లీ యూనివర్సిటీల బాట పడుతున్న 40 ఏళ్ల పైబడినవారు

ఎండలు పెరుగుతుండటం వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది. తెలంగాణ(Telangana) లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు చేరే అవకాశం ఉందని హెచ్చరించింది. అలాగే రానున్న మూడు రోజులు అంటే ఏప్రిల్ 3 వరకు పలు జిల్లాల్లో 41 నుంచి 44 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అకాశం ఉందని తెలిపింది. ఏప్రిల్ 2న నిర్మల్, ఆదిలాబాద్ నిజామాబాద్, జగిత్యాల , కుమరంభీం , పెద్దపల్లి, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం తదితర జిల్లాలకు వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపింది. అలాగే ఏప్రిల్ 3, 4 తేదీల్లో వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.

Also Read : సత్తుపల్లిలో పోలీసులపై గిరిజనులు దాడి..సీఐ కిరణ్‌ను కర్రలతో ఎలా కొట్టారో చూడండి!

Advertisment
Advertisment
తాజా కథనాలు