Rajinikanth Next Movie Movie With director Lokesh Kanagaraj: సూపర్ స్టార్ రజనీకాంత్ మంచి ఊపులో ఉన్నారు. జైలర్ సినిమా (Jailer Movie) సూపర్ డూపర్ హిట్ కొట్టింది. బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ప్రస్తుతం ఓటీటీలో కూడా ఈ సినిమా రఫ్పాడిస్తోంది. ఇక దీని తర్వాత రజనీ కాంత్ తన కూతురు డైరెక్షన్ లో వస్తున్న సినిమాలో నటిస్తున్నారు. దాదాపు దీని షూటింగ్ అయిపోయింది. మరోవైపు తలైవర్ కొత్త సినిమా గురించి కూడా అఫీషియల్ ప్రకటన వచ్చేసింది. విక్రమ్ ఫేమ్ లోకేష్ కనగరాజ్ తో రజనీ నెక్స్ట్ సినిమా ఉండబోతోంది. ప్రస్తుతం లోకేష్ విజయ్ తో లియో అనే సినిమా చేస్తున్నారు. ఇది అయిపోయిన తర్వాత రజనీ కాంత్ సినిమా పట్టాలెక్కుతుంది. రజనీకాంత్ కు ఇది 171వ సినిమా.
పూర్తిగా చదవండి..Rajinikanth: రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబోలో సినిమా…పిచ్చెక్కించడం ఖాయం
జైలర్ తో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన రజనీకాంత్ ఫ్యాన్ కు మరో ధమాకా న్యూస్ చెప్పారు. తలైవర్ 171వ సినిమా విక్రమ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తో చేస్తున్నట్లు అధికారిక న్యూస్ ప్రకటించారు.
Translate this News: