Rajinikanth: రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబోలో సినిమా...పిచ్చెక్కించడం ఖాయం

జైలర్ తో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన రజనీకాంత్ ఫ్యాన్ కు మరో ధమాకా న్యూస్ చెప్పారు. తలైవర్ 171వ సినిమా విక్రమ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తో చేస్తున్నట్లు అధికారిక న్యూస్ ప్రకటించారు.

New Update
Rajinikanth: రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబోలో సినిమా...పిచ్చెక్కించడం ఖాయం

Rajinikanth Next Movie Movie With director Lokesh Kanagaraj: సూపర్ స్టార్ రజనీకాంత్ మంచి ఊపులో ఉన్నారు. జైలర్ సినిమా (Jailer Movie) సూపర్ డూపర్ హిట్ కొట్టింది. బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ప్రస్తుతం ఓటీటీలో కూడా ఈ సినిమా రఫ్పాడిస్తోంది. ఇక దీని తర్వాత రజనీ కాంత్ తన కూతురు డైరెక్షన్ లో వస్తున్న సినిమాలో నటిస్తున్నారు. దాదాపు దీని షూటింగ్ అయిపోయింది. మరోవైపు తలైవర్ కొత్త సినిమా గురించి కూడా అఫీషియల్ ప్రకటన వచ్చేసింది. విక్రమ్ ఫేమ్ లోకేష్ కనగరాజ్ తో రజనీ నెక్స్ట్ సినిమా ఉండబోతోంది. ప్రస్తుతం లోకేష్ విజయ్ తో లియో అనే సినిమా చేస్తున్నారు. ఇది అయిపోయిన తర్వాత రజనీ కాంత్ సినిమా పట్టాలెక్కుతుంది. రజనీకాంత్ కు ఇది 171వ సినిమా.

లోకేష్ కనగరాజ్ సినిమాలు అంటే ఓ లెక్క ఉంటుంది. అతను కథకు, తీసే విధానానికి జనాలు ఫిదా అయిపోతుంటారు. ముఖ్యంగా విక్రమ్ సినిమాకు సినీ ప్రియులు నీరాజనాలు పట్టారు. ఈ సినిమాతో లోకేష్...కమల్ హాసన్ (Kamal Haasan) కు మంచి కమ్ బ్యాక్ ఇచ్చారు. ఇప్పుడు రజనీకాంత్ తో సినిమా అనేసరికి అటు సినీ ప్రియులు, ఇటు రజినీ ఫ్యాన్స్ సూపర్ హ్యాపీ గా అయిపోతున్నారు. ఇది కదా కాంబినేషన్ అని అంటున్నారు. లోకేష్, రజనీ కాంబో దుమ్ము లేపడం ఖాయం అని చెబుతున్నారు. ఈ సినిమా గురించి అధికారిక ప్రకటనను సన్ పిక్చర్స్ (Sun Pictures) తన ఎక్స్ ఖాతా(Twitter Account)లో పోస్ట్ చేసింది.

జైలర్ సినిమాలో రజనీ చరిష్మా ఒక ఎత్తు అయితే ఆ మూవీలో మ్యూజిక్ మరొక ఎత్తు. ప్రతీ సీన్ ఎలివేట్ అయ్యేలా అనిరుధ్ సంగీతాన్ని అందించారు. ఇప్పుడు లోకేష్-రజనీ కాంత్ కాంబోలో వచ్చిన సినిమాకు కూడా అనిరుధ్ (Anirudh) సంగీతాన్ని ఇవ్వనున్నారు.

Also Read: ఆర్‌ఆర్‌ఆర్ సినిమా పై ప్రశంసలు కురిపించిన బ్రెజిల్ అధ్యక్షుడు!

Advertisment
తాజా కథనాలు