/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-2024-01-01T151659.059-jpg.webp)
Sankranti Movies 2024: పండగలు వచ్చాయంటే సినిమాల సందడి సాధారణమే. ముఖ్యంగా సంక్రాంతి పండగకు మరిన్ని ఎక్కువ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉంటాయి. మిగతా పండగల కంటే కూడా సంక్రాంతికి వచ్చే సినిమాల హడావిడి ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ సంవత్సరం జనవరి నెలలో సంక్రాంతి కానుకగా పెద్ద హీరోల సినిమాల తో పాటు చిన్న సినిమాలు కూడా సంక్రాంతి బరిలో దూకడానికి రెడీ గా ఉన్నాయి. టాలీవుడ్ స్టార్స్ మహేష్ బాబు, వెంకటేష్, రవితేజ, యంగ్ హీరో తేజ సజ్జ సంక్రాంతికి పోటీ పడుతున్నారు. సంక్రాంతి బరిలో రాబోయే సినిమాల లిస్ట్ ఏంటో చూద్దాం
గుంటూరు కారం (Guntur Kaaram)
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) నటించిన లేటెస్ట్ చిత్రం గుంటూరు కారం. ఈ చిత్రం జనవరి 12 న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కానుంది.
ఈగల్ (Eagle)
మాస్ మహారాజ రవితేజ (Ravi Teja) కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో రాబోతున్న చిత్రం ఈగల్. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13 న థియేటర్స్ లో రిలీజ్ కానుంది. త్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా పై ఫ్యాన్స్ ఆసక్తిగా ఉన్నారు.
సైంధవ్ (Saindhav)
విక్టరీ వెంకటేష్ (Venkatesh) 75 వ చిత్రంగా తెరకెక్కిన సినిమా 'సైంధవ్'. వెంకటేష్ కెరీర్ లో ఈ సినిమా చాలా స్పెషల్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. 2024 జనవరి 13 ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
హనుమాన్ (Hanuman)
యంగ్ హీరో తేజ సజ్జ (Teja Sajja) నటించిన చిత్రం హనుమాన్. సూపర్ హీరో అడ్వెంచర్ ఫిలిం గా ఈ సినిమాను తెరకెక్కించారు. సినిమాలోని విజువల్స్, స్క్రీన్ ప్లై ప్రేక్షకులను మరో ఆదివాసీ ప్రపంచంలోకి తీసుకెళ్లాలి ఉన్నాయి. హనుమాన్ హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, భాషలతో పాటు స్పానిష్, జపనీస్, కొరియన్ భాషల్లో జనవరి 12 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
Also Read: DEVARA: న్యూ ఇయర్ స్పెషల్.. ‘దేవర’ నుంచి సాలిడ్ అప్ డేట్ ఇచ్చిన తారక్