Prabhas V/S Shahrukh: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన మూవీ సలార్. ఈ మూవీ రిలీజ్ కోసం ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 28వ తేదీనే విడుదల కావాల్సి ఉంది. కానీ, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడంతో విడుదలను వాయిదా వేశారు. సలార్ వచ్చే ఏడాది వేసవిలోనే వస్తుందన్న ప్రచారం జరుగుతుండగా డార్లింగ్ ఫాన్స్ కు ట్రీట్ ఇస్తూ కొత్త రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. సలార్ మూవీ రెండు భాగాలుగా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇక పార్ట్1 వరకు సిజ్ ఫైర్ అని టైటిల్ పెట్టారు.
పూర్తిగా చదవండి..Prabhas V/S Shahrukh : రెబల్ స్టార్ వర్సెస్ బాలీవుడ్ బాద్షా..!!
డార్లింగ్ ఫాన్స్ కు గుడ్ న్యూస్. పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ మూవీ సలార్ క్రిస్మస్ బరిలో నిలవనుంది. డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయించినట్టు తెలుస్తోంది. అదే సమయంలో షారుక్ ఖాన్, రాజ్ కుమార్ హిరానీ కాంబినేషన్లో వస్తున్న ‘డుంకీ’తో పోటీ పడనున్నట్లు తెలుస్తోంది.
Translate this News: