Perni Nani: నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు.. వెంట్రుక కూడా ఊడదు.. పేర్ని నాని సంచలన కామెంట్స్!

తన ఫోన్ ను ట్యాప్ చేస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. మంత్రి కొల్లు రవీంద్ర ప్రజా సేవకు పనికి రాడన్నారు. తనను అరెస్ట్ చేయిస్తా అంటూ చేస్తున్న వ్యాఖ్యలతో వెంట్రుక కూడా ఊడదన్నారు. తప్పుడు పనులు చేసినా వాళ్ళందరినీ చట్టం ముందు నిలబెడతానన్నారు.

New Update
Perni Nani Sensational Allegations

Perni Nani Sensational Allegations

తన ఫోన్ ను ట్యాప్ చేస్తున్నారని మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత పేర్ని నాని సంచలన ఆరోపణలు చేశారు. తమ పార్టీ కార్యకర్తల ఫోన్ నంబర్లను ఇటీవల కలెక్ట్  చేస్తున్నారన్నారు. ఫోన్ ట్యాప్ చేస్తున్నారన్న భయం తనకు లేదన్నారు. ట్యాప్ చేస్తున్నారనే  టీడీపీ లీడర్స్ ను కావాలని ఇంకా ఎక్కువ తిడుతున్నానన్నారు. గ్రామ స్థాయి లీడర్స్ భార్యల ఫోన్ నంబర్లతో పోలీసులకు ఏం పని అని ప్రశ్నించారు. ఈ రోజు విజయవాడ జైలులో ఉన్న వల్లభనేని వంశీని ఆయన కలిశారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. వంశీ కేసులో పోలీసు అధికారులు ఉన్నతాధికారుల పర్యవేక్షణతో దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాజకీయ నాయకులను సంతృప్తి పరచడం కోసం పని పటమట పోలీసులు చేస్తున్నారని ధ్వజమెత్తారు. 10న సత్యవర్ధన్ కోర్టుకు వచ్చి తప్పుడు కేసు అని అఫిడవిట్ ఇచ్చారన్నారు.
ఇది కూడా చదవండి: Karnool Road Accident: APలో ఘోర రోడ్డు ప్రమాదం.. కుంభమేళా నుంచి వస్తుండగా బస్సు బోల్తా: 45 మంది ప్రయాణికులు!

టీడీపీ కార్యకర్త ఫణి కుమార్ అనే వ్యక్తి ద్వారా సత్యవర్ధన్, వంశీపై తప్పుడు కేసులు పెట్టించారని ఫైర్ అయ్యారు. కిరణ్ అనే వ్యక్తి ద్వారా ఇంకో కంప్లైంట్ తీసుకొని కేసులు నమోదు చేశారన్నారు. ఊహాజనిత ఫిర్యాదుతో నాన్ బెయిలబుల్ సెక్షన్లు వంశీపై పెట్టారన్నారు. సత్య వర్ధన్ చెప్పాడో లేదో కూడా తెలియకుండా కేసు చేస్తారా? అని పోలీసులను ప్రశ్నించారు. వంశీని రిమాండ్ చేసేటప్పుడు ఎస్సీ, ఎస్టీ కేసుల న్యాయస్థానంలో కాకుండా వేరే కోర్టులో ప్రవేశపెట్టారన్నారు. చట్టాలు, కేసులు, సెక్షన్లు అనేవి లేకుండా పోలీసులు వ్యవహరించారని ధ్వజమెత్తారు. గుంటూరు మిర్చి యార్డు జగన్ పర్యటనలో తాను లేనన్నారు.
ఇది కూడా చదవండి: పదవ తరగతి పరీక్షల్లో చీటింగ్‌ జరిగిందని తుపాకులతో కాల్పులు.. ఒకరు మృతి

అయినా తనపై కేసు నమోదు చేశారని వాపోయారు. మచిలీపట్నంలో ఉంటే గుంటూరు వెళ్లానని కేసు నమోదు చేశారని ఫైర్ అయ్యారు. పోలీసులే ఒక చిట్టా రాసి కేసులు పెడుతున్నారని ఫైర్ అయ్యారు. విజయవాడలో అనధికారికంగా చంద్రబాబు బంధువు ప్రకాష్ అనే ఒక వ్యక్తి సిబ్బందిని నియమించుకుని ఫోన్స్ చేసి వైసీపీ నేతలను బెదిరించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. విజయవాడ రమేష్ ఆస్పత్రి దగ్గర ఆఫీసు పెట్టి అనధికారికంగా ఫోన్ ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు. కృష్ణా జిల్లా ఎస్పీ కనుసన్నల్లోనే ఇదంతా చేస్తున్నారన్నారు. ఎన్ని తప్పుడు పనులు చేసినా వాళ్ళందరినీ చట్టం ముందు నిలబెడతానని స్పష్టం చేశారు. 

కొల్లు రవీంద్రపై పేర్ని ఫైర్ 

కొల్లు రవీంద్ర మంత్రిగా ప్రజా సేవ చేయడానికి, ఊరు,రాష్ట్రాన్ని బాగు చేయడానికి పనికిరాడని ఫైర్ అయ్యారు. లోకేష్ అప్పగించే మూటల్లో నుంచి రాలిపడే నోట్లను జేబుల్లో కుక్కుకునే వ్యక్తి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొడాలి నానిని అరెస్టు చేయిస్తా.. పేర్ని నానినీ అరెస్టు చేయిస్తా అని అంటున్నాడన్నారు. తాను 6 నెలలుగా మచిలీపట్నం రోడ్లపై తిరుగుతున్నానని..  కొల్లు రవీంద్ర అంటున్న అరెస్టుల వల్ల ఒక్క వెంట్రుక కూడా ఊడదన్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు