Wines Closed: అలెర్ట్.. జూబ్లీహిల్స్‌లో వైన్స్, బార్లు, పబ్ లు బంద్..

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల ప్రచారం ముగిసిన సంగతి తెలిసిందే. సాయంత్రం 6 గంటల నుంచి ఆ ప్రాంతలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ వెల్లడించింది.

New Update
Vote

Vote

Wines Closed: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల ప్రచారం ముగిసిన సంగతి తెలిసిందే. సాయంత్రం 6 గంటల నుంచి ఆ ప్రాంతలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ వెల్లడించింది. అలాగే ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు జూబ్లీహిల్స్‌ పరిధిలో  వైన్స్, బార్లు, పబ్బులు, కల్లుదుకాణాలు మూసివేయాలని ఆదేశించింది. నవంబర్ 14న కౌంటింగ్‌ రోజున కూడా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా వీటిని బంద్ చేయాలని ఆదేశించింది.  

Also Read: పెళ్లి కాస్త విషాదం.. రోడ్డు ప్రమాదంలో 11 ఏళ్ల చిన్నారి సహా ముగ్గురు మృతి

నియోజకవర్గంలో మొత్తం 407 పోలింగ్‌ స్టేషన్లు ఉన్నాయని.. ఇందులో 226 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. పోలింగ్‌ను డ్రోన్ల ద్వారా పరిశీలిస్తామని.. ఈసారి 4 బ్యాలెట్‌ యూనిట్లు వినియోగిస్తున్నామని తెలిపారు. 2060 మంది పోలింగ్‌ సిబ్బంది విధుల్లో ఉండనున్నట్లు పేర్కొంది. 561 కంట్రోల్ యూనిట్లు, 595 వీవీ ప్యాట్లు, అలాగే 2,394 బ్యాలెట్‌ యూనిట్లు ఉన్నట్లు తెలిపారు. 

Also Read: రాత్రికి రాత్రే కూరగాయల వ్యాపారి కుబేరుడయ్యాడు..ఎలా అంటే?

అంతేకాదు పోలింగ్ స్టేషన్ల నుంచి వెబ్‌ కాస్టింగ్‌ లైవ్‌ స్ట్రీమింగ్ ఉంటుందని తెలిపారు. CISF నుంచి 8 కంపెనీల బలగాలు వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. మరోవైపు ఈ ఎన్నికల సందర్భంగా మొత్తం 27 రకాల కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం వీటిపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. అలాగే ఇప్పటిదాకా రూ.3 కోట్ల 60 లక్షల నగదును పట్టుకున్నామని స్పష్టం చేశారు. 

Advertisment
తాజా కథనాలు