/rtv/media/media_files/2025/09/19/konda-surekha-vs-vivek-2025-09-19-13-14-40.jpg)
Konda Surekha vs Vivek
MINISTERS FIGHT : తెలంగాణలో ఇద్దరు మంత్రుల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. తనకు సంబంధం లేని అటవీశాఖ అధికారులతో ఓ మంత్రి సమీక్ష నిర్వహించడం వివాదానికి దారితీసింది. తనకు తెలియకుండా తన శాఖ అధికారులతో మరో మంత్రి సమీక్ష జరపడం ఏమిటని అటవీశాఖ మంత్రి కొండా సురేఖ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు తనకు చెప్పకుండా అటవీ శాఖ అధికారులతో వివేక్ సమీక్ష చేయడంపై ఆమె సీఎంఓకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఉత్తర తెలంగాణకు చెందిన మంత్రి వివేక్ తన నియోజవర్గంలోని అటవీ భూముల మీదుగా వెళుతున్న రహదారులకు అటవీ క్లియరెన్స్, పోడు భూముల సమస్యలపై అటవీశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉపాధి, గనుల శాఖ మంత్రికి అటవీ శాఖతో సంబంధమేంటని కొండా సురేఖ
ఆగ్రహం వ్మక్తం చేశారు. దీనిపై అటవీ శాఖ అధికారులపై మంత్రి మండిపడినట్లు తెలిసింది.
Also Read : రాజీనామాపై క్లారిటీ ఇచ్చిన MLA రాజ్‌గోపాల్ రెడ్డి
చెన్నూరు నియోజకవర్గంలోని పోడు భూములకు సంబంధించి కొన్నిరోజుల క్రితం సచివాలయంలో వివేక్ సమీక్ష నిర్వహించినట్లు తెలిసింది. పీసీసీఎఫ్ సువర్ణ, ఆ సమీక్ష నిర్వహించిన మంత్రికి చెందిన జిల్లా కలెక్టర్, అటవీ శాఖ అధికారులు ఆ సమావేశంలో పాల్గొన్నట్లు తెలిసింది. ఈ విషయం మంత్రి కొండా సురేఖకు తెలియడంతో ఆమె అసహనానికి గురయ్యారు. -- మంత్రి కొండా సురేఖకు చెప్పకుండా సమీక్ష చేయడంతో వివాదం నెలకొంది. అటవీ శాఖ హెచ్‌ఓడీగా ఉన్న పీసీసీఎఫ్‌ను నేరుగా పిలవడమంటే మొత్తం శాఖకు సంబంధించిన ఉన్నతాధికారినే పిలిచినట్టు అవుతుందని కొండా సురేఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.
Also Read: Sootravakyam: ఓటీటీలో రికార్డులు దుల్లగొడుతున్న మలయాళ మూవీ.. ఆలస్యమెందుకు ఈ థ్రిల్లర్ మూవీ చూసేయండి!
జిల్లా, నియోజకవర్గానికి సంబంధించిన అంశాలైతే అక్కడి అధికారులను మాత్రమే సమావేశానికి పిలవాల్సిందని కొండా పేర్కొన్నట్టు సమాచారం. దీనిపై ఆమె సీఎం కార్యాలయానికి ఫిర్యాదు చేయడంతో వివాదం మరింత ముదిరింది. మరోవైపు సదరు మంత్రి మాత్రం తన నియోజకవర్గానికి సంబంధించిన అటవీ అంశాలు కావడం మూలంగానే ఆ అధికారులతో మాట్లాడానని వివేకా అన్నట్లు సమాచారం. మరోవైపు మంత్రి కొండా సురేఖ కాలుష్య నియంత్రణ బోర్డు అధికారుల తీరునూ తప్పుబట్టారు. కాలుష్య నియంత్రణ బోర్డుకు సంబంధించిన సమీక్షకు హాజరైన అధికారులు, సరిగా వివరాలు ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు అటవీ శాఖ ఉన్నతాధికారుల తీరుపైనా కొండా సురేఖ మండిపడటం చర్చనీయాంశంగా మారింది. కాగా -- సీఎం రేవంత్, ఢిల్లీ నుంచి వచ్చాక పంచాయతీకి పుల్‌స్టాఫ్ పడే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: Shanmukh Jaswanth: 'ప్రేమకు నమస్కారం' అంటున్న షణ్ముఖ్.. కొత్త సినిమా గ్లింప్స్ అదిరింది బ్రో !