Revanth Reddy: సభకు మీరు వస్తారా? ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి నన్ను రమ్మంటారా? కేసీఆర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓపెన్ ఆఫర్..

మీ అనుభవాన్నిపరిగణనలోకి తీసుకుంటాం.. మీ సూచనలు తెలంగాణకు ప్రయోజనం చేకూరుతాయంటే తీసుకుంటామని సీఎం రేవంత్‌ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్‌కు ఓపెన్‌ ఆఫర్‌ ఇచ్చారు.  కృష్ణా జలాల అంశంపై ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇచ్చిన పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌కు సీఎం హాజరై మాట్లాడారు.

New Update
Chief Minister Revanth Reddy's open offer to KC

Chief Minister Revanth Reddy's open offer to KCR..

మీ అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుంటాం.. మీ సూచనలు తెలంగాణకు ప్రయోజనం చేకూరుతాయంటే తీసుకుంటామని తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఓపెన్‌ ఆఫర్‌ ఇచ్చారు.  కృష్ణా జలాల అంశంపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇచ్చిన పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌కు సీఎం హాజరై మాట్లాడారు. కేసీఆర్…మీరు రండి. నిపుణులను పిలుస్తాం. మా డాక్యుమెంట్ సభలో పెడతాం. మీరు సూచన చేయండి.. అవసరం అనుకుంటే మార్చుకుంటామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది.. ఎక్స్‌ఫర్ట్స్ ఒపీనియన్ కూడా సభలో వినిపిద్దామన్నారు. మీరు శాసనసభ సమావేశాలు పెట్టాలని ఎప్పడు స్పీకర్ కు లేఖ రాసినా మేం సిద్ధమన్నారు. మీ హయాంలో, మా హయాంలో తీసుకున్న నిర్ణయాలపై చర్చ పెడదామన్నారు.

Also Read: కర్ణాటకలో సీఎం మార్పు.. క్లారిటీ ఇచ్చిన డీకే శివకుమార్‌

Also Read: కుప్పకూలిన ఎయిర్‌ఫోర్స్ యుద్ధ విమానం.. పైలట్ మృతి

Revanth Reddy's Open Offer To KCR

సభా నాయకుడిగా నేను మాట ఇస్తున్నా …ఎలాంటి గందరగోళం లేకుండా.. ఎవరి గౌరవానికి భంగం కలగకుండా చూసుకునే బాధ్యత నాది కేసీఆర్  మీరు రండి..స్టేక్ హోల్డర్స్ ను పిలుద్దాం.. అర్ధవంతమైన చర్చ పెడదామని రేవంత్‌ రెడ్డి కేసీఆర్‌కు సూచించారు.మీ ఆరోగ్యం సహకరించకపోతే.. తారీఖు చెప్పండి.. ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు నేను మంత్రుల బృందాన్ని పంపుతా.. మాక్ అసెంబ్లీ నిర్వహిస్తాం… కాదు కూడదు నేనుకూడా రావాలంటే ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో జరిగే ప్రజాప్రతినిధుల సమావేశానికి రావడానికి నేనుకూడా సిద్ధం.. వాస్తవాలను ప్రజలకు అందించడమే మా ఉద్దేశం అని స్పష్టం చేశారు. తెలంగాణ హక్కులను ఎవరికీ తాకట్టు పెట్టం.తెలంగాణ హక్కుల విషయంలో దేవుడు ఎదురొచ్చినా నిటారుగా నిలబడి పోరాడుతామని స్పష్టం చేశారు.

Also Read : రూ. 76 లక్షల ఫోర్జరీ కేసులో అలియా భట్ పీఏ అరెస్ట్ ! ఎవరీ వేదికా ప్రకాష్

కేసీఆర్.. ప్రతిపక్ష నాయకుడు. ఆయన ఆరోగ్యం బాగుండాలి అని నేను కోరుకుంటున్న. ఆయన కొడుకు మాత్రం ఆయనేందుకు.. నేనున్న అంటారు. మీ కుటుంబ సభ్యుల లొల్లి ఉంటే కుల పెద్దల్లో.. ఇంటి పెద్దల్లో కూర్చొని మాట్లాడుకోండి. ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి మా మంత్రులను పంపిస్తా. కేసీఆర్ ఆరోగ్యం సహకరించక పోతే కుర్చీలో కూర్చోండి. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో మాక్ అసెంబ్లీ పెడదాం. మంత్రులు వద్దు అంటే… నేనే వస్తా. క్లబ్బులు.. పబ్బులకు మేము దూరం అని రేవంత్‌ ఎద్దేవా చేశారు.  ప్రజాభవన్ గడి కాదు, ఇక్కడ ధర్మగంట ఎవరైనా కొట్టవచ్చని స్పష్టం చేశారు.

Also Read: పప్పు బాలేదని తుప్పు రేగొట్టిన ఎమ్మెల్యే.. చొక్కా విప్పి మరీ.. వీడియో వైరల్

Ktr | kcr | prajabhavan | minister-uttam-kumar-reddy | krishna-water-issue | krishna-water | kcr vs revanth reddy | ktr vs cm revanthreddy | cm-revanthreddy

Advertisment
Advertisment
తాజా కథనాలు