మాకున్న రాజకీయ అనుభవం కేటీఆర్‌కు లేదని, మా అనుభవం ముందు ఆయన జీరో అని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎంను గోకడమెందుకు.. తన్నించుకోవడమేందుకు? అంటూ ఎద్దేవా చేశారు. ఐదేళ్లు పాలించమని మాకు ప్రజలు అవకాశం ఇచ్చారన్నారు. ప్రజా పాలన అందించాలన్నదే మా లక్ష్యం అని ఆయన స్పష్టం చేశారు. మేమంతా ఎన్నో వ్యయప్రయాసలతో రాజకీయ నేతలమైతే కేటీఆర్ తన తండ్రి సీటిస్తే డైరెక్ట్ ఎమ్మెల్యే అయ్యారని కేటీఆర్ సర్పంచ్ గా గెలిచారా? జడ్పీటీసీగా గెలిచారా? అని ప్రశ్నించారు. కేటీఆర్ కు డక్కాముక్కీలు ఎలా తెలుస్తాయన్నారు. అనుభవంతో కూడుకున్న రాజకీయం అన్నారు.
Also Read: Himachal Pradesh: బంగారం, డబ్బు నీళ్ళ పాలు..బ్యాంక్ ను ముంచెత్తిన వరద
Also Read : నితీశ్ కుమార్ సంచలన నిర్ణయం.. మహిళలకు 35 శాతం రిజర్వేషన్
Jagga Reddy Comments
కేటీఆర్ చిన్న పిల్లాడిలా మాట్లాడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డితో చర్చించే స్థాయి కేటీఆర్ కు లేదని ఆయన సీఎంను ప్రెస్ క్లబ్ కు చర్చలకు రమ్మని పిలవడం సరికాదన్నారు. కేటీఆర్ నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడుతున్నారని మమ్మల్ని విమర్శించే నైతిక హక్కు మీకు లేదన్నారు. మీరు మాట్లాడేదాన్ని బట్టే మా స్పందన ఉంటుందని మీరు గాడిదలు అంటే పడేవారెవరూ లేరని హెచ్చరించారు. కాంగ్రెస్ ను విమర్శించే ముందు కేటీఆర్ బాగా స్టడీ చేయాలి. మమ్మల్నీ ఒక మాట అంటే పది మాటలు కేటీఆర్ ను అంటాం. కేటీఆర్ సీఎంని తిట్టడం మానేస్తే మేము కూడా కౌంటర్లు బంద్ చేస్తామన్నారు. కేటీఆర్ కవిత దెబ్బలకు తట్టుకోలేకపోతున్నారని అన్నారు. కేటీఆర్ నెలలో 20 రోజులు విదేశీ పర్యటనలకు వెళ్తున్నారని.. 18 నెలలు అధికారం లేకపోయేసరికి కేటీఆర్ ఒడ్డున పడ్డ చేపలా కొట్టుకుంటున్నారని జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు.
Also Read: Anand Mahindra: అందమైన పల్లెటూరు.. ఆనంద్ మహీంద్రా ఆసక్తికర పోస్ట్
Also Read : శంషాబాద్ లో చిన్నారి కిడ్నాప్..కల్లుతాగించి..
cm-revanthreddy | ktr vs cm revanthreddy | jaggareddy | ex-mla-jaggareddy | ktr vs revanth reddy
Jagga Reddy: సీఎంను గోకుడెందుకు.. తన్నించుకోవడమెందుకు? జగ్గారెడ్డి సంచలన కామెంట్స్
మాకున్న రాజకీయ అనుభవం కేటీఆర్‌కు లేదని, మా అనుభవం ముందు ఆయన జీరో అని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎంను గోకడమెందుకు.. తన్నించుకోవడమేందుకు? అంటూ ఎద్దేవా చేశారు. ఐదేళ్లు పాలించమని మాకు ప్రజలు అవకాశం ఇచ్చారన్నారు.
T Jayaprakash Reddy