bandisanjay vs revanthreddy : ప్రధాని మోడీ కులంపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఫైర్ అవుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కులంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. నరేంద్ర మోదీ పుట్టుకతో బీసీ కాదని, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అని రేవంత్ రెడ్డి అన్నారు. పుట్టుకతో ఉన్నత కులం అయినటప్పటికీ, 2001లో ముఖ్యమంత్రి అయ్యాక ఆయన కులాన్ని బీసీ కులాల్లో కలుపుకొన్నారని తెలంగాణ ముఖ్యమంత్రి ఓ సభలో వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్‌పై కేంద్ర మంత్రి బండి సంజయ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా రియాక్ట్ అయ్యారు. 42శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మరో డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరలేపిందని.. ఇందులో భాగంగానే సీఎం రేవంత్ ప్రధానమంత్రి కులంపై చర్చ మొదలు పెట్టారని ఫైర్ అయ్యారు.
ఇది కూడా చదవండి: Pakistanis Deported: పాకిస్థాన్‌కు బిగ్ షాక్.. 12 దేశాల నుంచి బహిష్కరణ!
ప్రధానిపై రేవంత్ చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ నేత బండి సంజయ్ ఖండించారు. పుట్టగానే మనిషికి కులం పేరు పెడతామా? అని బండి సంజయ్.. ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. సంచలనం కొరకే ప్రధానిపై రేవంత్ వ్యాఖ్యలు చేశారని దుయ్యబట్టారు. బాధ్యతాయుత పదవిలో ఉండి రేవంత్ ఇలాంటి మాటలు మాట్లాడటం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు. మోడీ కులాన్ని బీసీలో చేర్చింది కాంగ్రెస్సే అని బండి సంజయ్ అన్నారు. ఆ సమయంలో రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నారు కనుక ఈ విషయం ఆయనకు తెలియదు అనుకుంటా అని సెటైర్లు వేశారు.
ఇది కూడా చదవండి: Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ లో కీలక మార్పులు.. మున్షీ ఔట్.. కొత్త ఇన్‌ఛార్జ్ ఎవరంటే?
ప్రధాని మోడీపై సీఎం చేసిన పరిశోధన పూర్తిగా విఫలమైందని.. ఎందుకంటే 1994లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే ప్రధానమంత్రి మోడీ కులాన్ని ఓబీసీగా జాబితాలో చేర్చారని.. ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి మర్చిపోయారని ఎద్దేవా చేశారు. మోడీ కులంపై మాట్లాడిన రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఏ కులానికి చెందినవారు..? అతని మతం ఏమిటి..? చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీతో పాటు ఆయన కులం మతం సీఎంకి కూడా తెలువదా అని అన్నారు. రాహుల్ గాంధీ తాత ఫిరోజ్ జహంగీర్ గాంధీ.
ఇది కూడా చదవండి: Vallabhaneni Vamsi Arrest Case: నా భర్తను జైల్లో చంపేస్తారు.. వల్లభనేని వంశీ భార్య సంచలన ఆరోపణలు!
రాహుల్‌ది ఏ కులం..? ఏ మతం..? ఏ దేశం..? దీనిపై 10 జనపథ్‌లో చర్చ జరగాలి అని బండి సంజయ్ అన్నారు. సోనియా క్రిస్టియన్, ఇటలీ దేశస్తురాలు అయినప్పుడు.. ఆమె కొడుకు ఏ దేశస్థుడు అవుతాడు..? రాహుల్ గాంధీది ఏ కులమని మీరు ప్రోత్సహిస్తున్నారు..? రాహుల్‌కి కులం, మతం, దేశం, జాతి లేదు. రేవంత్ దీనికేం ఏం సమాధానం ఇస్తారు..? అని బండి సంజయ్ ప్రశ్నల వర్షం కురిపించారు. మోదీని బీసీగా దేశమంతా గుర్తించిందని బండి సంజయ్ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలను డైవర్ట్ చేసేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి ఇటువంటి స్టేట్ మెంట్లు ఇస్తున్నారని ఆరోపించారు.
ఇది కూడా చదవండి: Bujji Thalli Song: 100 మిలియన్ వ్యూస్.. యూట్యూబ్ లో దుమ్మురేపుతున్న 'బుజ్జితల్లి' సాంగ్
హిందూ సంప్రదాయంలో కులం తండ్రి ద్వారా వస్తుందన్నారు. ఇప్పుడు ఎవరు చట్టపరంగా మతం మార్చుకున్నారో అనే చర్చ చేయాలని అనుకుంటే.. సీఎం రేవంత్ రెడ్డి ముందుగా 10 జనపథ్ నుంచి చర్చ పెట్టాలని సూచించారు. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ఎంత దృష్టి మరలించాలని ప్రయత్నించిన అది పని చేయదని.. ఇప్పటికే బీజేపీ తరుపున మా నిర్ణయం తేల్చి చెప్పామన్నారు. బీసీ జాబితాలో ముస్లింలను చేరుస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని.. అలాంటి ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు సిద్ధం గా ఉన్నామని బండి సంజయ్ పేర్కొన్నారు.

Bandi Sanjay : రాహుల్ గాంధీది ఏ కులం..కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
ప్రధాని మోడీ కులంపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత బండి సంజయ్ ఫైర్ అయ్యారు. రాహుల్‌ది ఏ కులం..? ఏ మతం.? ఏ దేశం.?దీనిపై 10 జనపథ్‌లో చర్చ జరగాలన్నారు. సోనియా క్రిస్టియన్,ఇటలీ దేశస్తురాలు అయితే ఆమె కొడుకు ఏ దేశస్థుడవుతాడు..?అని ప్రశ్నించారు.
bandisanjay vs revanthreddy